TTD EO INSPECTS SV AYURVEDA PHARMACY _ ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీని పరిశీలించిన ప‌రిశీలించిన టిటిడి ఈవో

Tirupati, 20 Jan. 21: TTD Executive Officer Dr KS Jawahar Reddy along with Tirupati JEO Sri P Basanth Kumar inspected the SV Ayurveda Pharmacy at Narasingapuram on Wednesday.

As part of it, he went through the exhibition stalls and nursery set up for spreading awareness among students on raw materials, examined research halls, formulation unit etc. Dr Narapa Reddy, in-charge of the Ayurveda Pharmacy explained the process and systems of Ayurveda medicine to the TTD EO and JEOs.

Later they also visited the Pharmacy Bhavan, Godowns of raw materials and finished products and gave some suggestions to improve them to the officials concerned.

Among the other senior officials who were present included CE Sri Ramesh Reddy, SV Goshala Director, Dr Harnath Reddy, RMO Dr Padmavati, SV Ayurveda College Principal Sri Murali Krishna and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీని పరిశీలించిన ప‌రిశీలించిన టిటిడి ఈవో 

తిరుప‌తి, 2021 జనవరి 20: నరసింగాపురంలోని ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ, న‌ర్స‌రీని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి బుధ‌వారం ఉద‌యం అధికారులతో క‌లిసి ప‌రిశీలించారు.

ఆయుర్వేద ఫార్మసీలో ముడి ప‌దార్థాలు, ప‌రిశోధ‌న శాల, మందుల త‌యారీ విభాగం, ఆయుర్వేదంపై విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేదుకు ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న శాల, న‌ర్శ‌రీని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయుర్వేద ఫార్మ‌సీ ఇన్‌ఛార్జి డాక్ట‌ర్ నార‌ప‌రెడ్డి ఆయుర్వేద మందుల త‌యారీని ఈవో, జెఈవోల‌కు వివ‌రించారు. అనంత‌రం ఆయ‌న ఫార్మ‌సీ భ‌వ‌నాల‌ను, ముడి ప‌దార్థాలు, మందులు నిల్వ ఉంచే గోడౌన్‌ల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌నలు చేశారు.  ‌

ఈ కార్యక్ర‌మంలో జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్‌, సిఇ శ్రీ రమేష్ రెడ్డి,  ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, ఆర్‌.ఎమ్‌.వో డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి, ఎస్వీ ఆయుర్వేద క‌ళాశాల ప్రిన్సిపల్ శ్రీ ముర‌ళికృష్ణ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.