EO INSPECTS SV GOSALA _ ఎస్వీ గోశాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

Tirupati, 1 Apr. 21: TTD EO Dr KS Jawahar Reddy on Thursday SV Goshala and verified the developmental activities being done to develop desi breeds.

He also inspected the progeny being developed by the way of Embryo transfer which is underway among fifty cows in SV Goshala.

The SV Goshala Director Dr Harnath Reddy said of the 2000 odd cows in SV Goshala, milk yielding are 121 while there are 30 cows in Tirumala and another 1000 plus at Palamaner Goshalas.

CE Sri Ramesh Reddy, SE 1 Sri Jagadeeshwar Reddy, SE Electrical Sri Venkateswarulu were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

ఎస్వీ గోశాల‌ను ప‌రిశీలించిన టిటిడి ఈవో

తిరుప‌తి, 2021, ఏప్రిల్ 01: తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ‌శాల‌ను గురువారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ప‌రిశీలించారు. దేశ‌వాళి గోజాతుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

పిండ మార్పిడి విధానం ద్వారా దేశీయ గోజాతుల అభివృద్ధి కోసం నిర్దేశించిన 50 గోవుల‌ను ప‌రిశీలించారు. అదేవిధంగా, సేంద్రియ ఎరువుల‌ త‌యారీ కోసం ఏర్పాటుచేస్తున్న ప్లాంట్‌ను ప‌రిశీలించి, ఈ ఎరువుల‌ను చ‌క్క‌గా మార్కెటింగ్ చేయాల‌ని సూచించారు. తిరుప‌తిలోని గోశాల‌లో 2,070 గోవులున్నాయ‌ని, వీటిలో 121 గోవుల నుండి పాల సేక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రినాథ్‌రెడ్డి ఈవోకు వివ‌రించారు. ఇవేగాక‌, తిరుమ‌ల గోశాల‌లో 30 గోవులు, ప‌ల‌మ‌నేరు గోశాల‌లో 1,050 గోవులు ఉన్నాయ‌ని తెలియ‌జేశారు.

ఈవో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఎస్ఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఎస్ఇ(ఎల‌క్ట్రిక‌ల్స్‌) శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.