TTD HANDOVERS 15K FOOD PACKETS _ తిరుప‌తిలో తొలిరోజు 15 వేల ఆహార‌పొట్లాలు పంపిణీ

Tirupati, 28 Mar. 20: Upon the request of the district administration to provide food packets to the shelter-less and on-duty staff deputed in view of Covid 19 Lockdown in temple city of Tirupati, TTD on Saturday prepared 15000 Pulihora packets.

JEO Sri P Basant Kumar personally supervised the food packets arrangements at TTD Employees Canteen in Tirupati which was prepared under the Annaprasadam Trust Wing of TTD.

From Sunday onwards, TTD will pack 45 thousand food packets which includes 30 thousand packets in the first half of the day and 15 thousands in night. Everyday there will change of menu including Curd Rice, Pepper rice, Vegetable rice, Tomato rice, Bisibelabath, Pongal etc.

The food packets were handed over to Revenue, TMC and TUDA officials who in turn took up the distribution process at Vishnunivasam, Srinivasasam, First and Second Chouwltries and Padmavathi Nilayam at Tiruchanoor.

DyEO Annaprasadam Trust Sri Nagaraja, DyEO Sri Govindarajan, DyEO Tirupati Annaprasadam Sri Lakshman Naik, Catering Officer Sri Saibaba Reddy, Kalyanotsavam Project Special Officer Sri RS Gopal and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుప‌తిలో తొలిరోజు 15 వేల ఆహార‌పొట్లాలు పంపిణీ
తిరుమల, 2020 మార్చి 28: టిటిడి బోర్డు ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేర‌కు తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తొలిరోజు శ‌నివారం 15 వేల పులిహోర పొట్లాల‌ను టిటిడి అన్న‌ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో సిద్ధం చేశారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం వ‌ద్ద‌గ‌ల క్యాంటీన్‌లో ఈ మేర‌కు ఆహార‌పొట్లాల‌ను రెవెన్యూ, తుడ‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారుల‌కు అంద‌జేశారు. కాగా, పొంగ‌ళ్‌, పెరుగ‌న్నం, ట‌మోటా రైస్‌, బిసిబెళా బాత్‌, కిచిడీ త‌దిత‌రాల‌తో కూడిన మెనును రోజుకొక‌టి చొప్పున త‌యారుచేస్తారు. ప్ర‌తిరోజూ మ‌ధ్యాహ్నం 30 వేల పొట్లాలు, రాత్రి 15 వేల పొట్లాలను త‌యారు చేసేందుకు టిటిడి అధికారులు ప్ర‌ణాళిక రూపొందించారు. రెవెన్యూ, తుడ‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు త‌మ సిబ్బంది సాయంతో తిరుప‌తిలోని శ్రీ‌నివాసం, విష్ణునివాసం, రెండో స‌త్రం, తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి నిల‌యం వ‌ద్ద ఆహార పొట్లాల‌ను అవ‌స‌ర‌మైన వారికి అందిస్తారు.

అన్న‌ప్ర‌సాద విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ నాగ‌రాజ‌, శ్రీ ల‌క్ష్మ‌ణ్‌నాయ‌క్‌, డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద‌రాజ‌న్‌, క్యాట‌రింగ్ అధికారి శ్రీ సాయిబాబారెడ్డి, శ్రీ‌నివాస క‌ల్యాణం ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆర్ఎస్‌.గోపాల్‌ త‌దిత‌రులు ఆహార‌పొట్లాల త‌యారీని  ప‌ర్య‌వేక్షించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.