CHANDRA PRABHA VAHANAM HELD _ చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి అభ‌యం

Tirupati, 5 Mar. 21: On Friday evening as part of the ongoing annual Brahmotsavams in Sri kapileswara Swamy Temple, Chandra Prabha vahanam took place.

Sri Somaskandamurty graced on the Chandraprabha Vahanam to bless the pilgrims.

DyEO Sri Subramanyam and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి అభ‌యం

తిరుపతి, 2021 మార్చి 05: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన శుక్ర‌వారం రాత్రి శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి చంద్ర‌ప్రభ వాహనంపై క‌టాక్షించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.