PEACOCK DANCERS THRILL DEVOTEES AT CHINNASESHA VAHANAM_ చిన్నశేష వాహనసేవ‌లో ఆక‌ట్టుకున్న సూర్య‌కుటుంబం, బిందెల నృత్యం, నెమ‌లి నృత్యం
By TTD News On 11 Oct, 2018 At 02:07 PM | Categorized As Brahmotsavams

Tirumala, 11 October 2018: The highlight of the cultural paegant at the Chinna Sesha Vahanam on mada streets today was the display of God Surya pageant, besides the peacock and Vessel Dancers.

The cultural display got up in the morning of Navaratri Brahmotsavams enthralled the devotees who waited in the galleries of mada streets braving the hot sun.

The Team of Sri Garudadrivasa Bhajan mandali of Rajahmundry led by Smt Hemalatha displayed all the Rashis of Surya family comprising of Seven Horses, Surya mother Aditi, father Kashyapa, Prahladi, Vishkarma, Sajnadevi (surya wife), Masnu and Yama (children) etc.

The Binde dance (water pot) displayed by six artists was captivating. The bamboo dolls dance and the kolatas by 32 artistes of Srimadnanda Nilayavasa team of Bangalore thrilled the devotees.

Similarly the peacock dance by 28 artistes of the Nritya Drishya trust of Bangalore led by Smt Darshani Manjunatha was the high light of the cultural bonanza in the morning sevas of the day at Mada streets.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చిన్నశేష వాహనసేవ‌లో ఆక‌ట్టుకున్న సూర్య‌కుటుంబం, బిందెల నృత్యం, నెమ‌లి నృత్యం

అక్టోబ‌రు 11, తిరుమల, 2018: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం జ‌రిగిన చిన్నశేష వాహనసేవ‌లో టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్న‌మాచార్య ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు. ఇందులో సూర్య‌కుటుంబం ప్ర‌ద‌ర్శ‌న, బిందెల నృత్యం, నెమ‌లి నృత్యం ఆక‌ట్టుకున్నాయి.

రాజ‌మండ్రికి చెందిన శ్రీ‌మ‌తి హేమ‌ల‌త ఆధ్వ‌ర్యంలో శ్రీ గ‌రుడాద్రివాసా భ‌జ‌న మండ‌లి క‌ళాకారులు సూర్య‌కుటుంబం, వివిధ రాశుల్లో సూర్య‌సంక్ర‌మ‌ణం విష‌యాల‌ను తెలియ‌జేశారు. ఇందులో స‌ప్త అశ్వాలు, ద్వాద‌శాదిత్యులు, సూర్యుని త‌ల్లి అదితి, తండ్రి క‌శ్య‌పుడు, అత్త ప్ర‌హ్లాది, మామ విశ్వ‌క‌ర్మ‌, సూర్యుని భార్య సంజ్ఞాదేవి, సంతానం మ‌నువు, య‌ముడు, అశ్వ‌నీదేవ‌త‌లు, య‌మున‌, సూర్యుని శిష్యులు మ‌నువు, యాజ్ఞ‌వ‌ల్క్యుడు, హ‌నుమంతుడు, ఆయా తెలుగు నెల‌ల్లో సూర్యుడు సంక్ర‌మించే విధానాలు త‌దిత‌ర వివ‌రాలు ఉన్నాయి. వీటితో పాటు ఆరుగురు క‌ళాకారులు ప్ర‌ద‌ర్శించిన బిందెల నృత్యం విశేషంగా ఉంది. ఈ బృందంలోని మ‌రికొంద‌రు క‌ళాకారులు చేసిన బుట్ట‌బొమ్మ‌ల నృత్యం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.

అదేవిధంగా, బెంగ‌ళూరుకు చెందిన శ్రీ‌మదానందనిల‌య‌వాస బృందంలోని 32 మంది క‌ళాకారులు పురంద‌ర దాస కీర్త‌న‌ల‌కు చ‌క్క‌గా కోలాట‌మాడారు. బెంగ‌ళూరుకు చెందిన శ్రీ‌మ‌తి ద‌ర్శిని మంజునాథ్ ఆధ్వ‌ర్యంలోని నృత్య దిశ ట్ర‌స్టుకు చెందిన 28 మంది క‌ళాకారులు అద్భుతంగా నెమ‌లి నృత్యం, భ‌ర‌త‌నాట్యాన్ని ప్ర‌ద‌ర్శించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v