TTD TAKES OVER SRI KALYANA VENKATESWARA TEMPLE AT PUNGANUR _ టిటిడి ఆధీనంలోకి పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆల‌యం

Tirupati, 5 Dec. 20: The merger of the Sri Kalyana Venkateswara temple at Punganur in Chittoor district with the TTD was performed in the presence of AP minister Sri Peddireddi Ramachandra Reddy on Saturday.

Thereafter the Assistant Commissioner of state endowment department Sri Chandramouli handed over the records and other documents of the temple to DyEO Smt Shanti, in-charge of Sri Kalyana Venkateswara temple of Srinivasa Mangapuram group of temples of TTD.

MP Sri Reddappa, TTD AEO Sri Dhananjayalu, Municipal Commissioner Sri Sharma, OSD of the constituency Sri Rajasekhar Naidu, temple EO Sri Kamalakar, superintendent Sri Nagaraj and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఆధీనంలోకి పుంగ‌నూరులోని శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆల‌యం

తిరుప‌తి, 2020 డిసెంబ‌రు 05: చిత్తూరు జిల్లా పుంగ‌నూరులోని కోనేటిపాళ్యంలో గ‌ల‌ శ్రీ క‌ల్యాణ వేంక‌ట‌ర‌మ‌ణ‌స్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం శ‌ని‌‌వారం జ‌రిగింది. రాష్ట్ర మంత్రివ‌ర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

అనంత‌రం రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శ్రీ చంద్ర‌మౌళి ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతికి అంద‌జేశారు. శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌‌‌స్వామివారి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

ఈ కార్య‌క్ర‌మంలో పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ రెడ్డెప్ప‌, టిటిడి ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ వ‌ర్మ‌, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌త్యేకాధికారి శ్రీ రాజ‌శేఖ‌ర్‌నాయుడు, ఆల‌య ఈవో శ్రీ క‌మ‌లాక‌ర్‌, సూప‌రింటెండెంట్లు శ్రీ న‌ట‌రాజు, శ్రీ చెంగ‌ల్రాయ‌లు, అర్చ‌కుడు శ్రీ బాలాజి రంగాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.