SATISFACTORY TENURE-EO _ టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌తో ఆత్మీయ స‌మావేశం

Tirumala, 2 Oct. 20: TTD EO Sri Anil Kumar Singhal who has been posted as Principal Secretary Medical, Health and Family Welfare was given a hi tea at Annamaiah Bhavan, Tirumala on Friday.

The pleasant session was organised by the Additional EO Sri AV Dharma Reddy along with other senior officials of TTD.

Speaking at the function outgoing EO Sri Singhal said he was highly satisfied and privileged to serve in world renowned religious institution of Tirumala Tirupati Devasthanams for 3 years and five months and thanked all TTD employees for their unbridled support and cooperation.

He was confident that they would continue to serve the devotees in the same spirit and dedication.

Earlier Additional EO Sri AV Dharma Reddy summed up series of development activities that were taken up during the tenure of Sri Singhal as 25th EO of TTD through Power Point Presentation.

SVBC CEO Sri Suresh Kumar, SE-2 Sri Nageswar Rao, Srivari temple DyEO Sri Harindranath, DyEO Reception Sri Balaji, DyEO (Revenue and Panchayat) Sri Vijayasaradhi, EEs, DE Sri Saraswati, Health officer Dr RR Reddy, GM Sri Sesha Reddy, Garden Deputy Director Sri Srinivas and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌తో ఆత్మీయ స‌మావేశం

తిరుమల, 2020 అక్టోబరు 02: రాష్ట్ర వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బ‌దిలీపై వెళుతున్న టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌తో శుక్ర‌వారం టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఇత‌ర అధికారులు ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో ఈ స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన‌ముల వంటి ప్ర‌ఖ్యాత ధార్మిక సంస్థ‌లో 3 సంవ‌త్స‌రాల 5 నెల‌లు సంతృప్తిక‌రంగా సేవ‌లందించాన‌ని చెప్పారు. ఇందుకు స‌హ‌క‌రించిన టిటిడిలోని అన్ని విభాగాల అధికారుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భ‌విష్య‌త్తులోనూ అధికారులు ఇదేస్ఫూర్తితో స‌మ‌ష్టిగా ప‌నిచేసి భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లందించాల‌ని కోరారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ టిటిడి 25వ ఈవోగా శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ బాధ్య‌త‌లు చేప‌ట్టి పాల‌న‌లో త‌న‌దైన ముద్ర వేశార‌న్నారు. చారిత్రాత్మ‌క‌మైన ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టార‌ని కొనియాడారు. శ్రీ పివిఆర్‌కె.ప్ర‌సాద్ త‌రువాత సుదీర్ఘ కాలం సేవ‌లందించిన ఈవోగా గుర్తింపు పొందార‌ని చెప్పారు.

 ఈ స‌మావేశంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్ కుమార్‌, ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, డెప్యూటీ ఈఓ ఆర్‌-2 శ్రీ బాలాజి, డెప్యూటీ ఈవో(రెవెన్యూ మ‌రియు పంచాయితీ) శ్రీ విజ‌య‌సార‌ధి, డిఇ శ్రీమ‌తి స‌ర‌స్వ‌తి, ఆరోగ్య‌శాఖాధికారి డా. ఆర్ఆర్‌.రెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.