JEO H AND E INSPECTS PROJECTS _ టిటిడి ప్రాజెక్టులను తనిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 13 Nov. 20 : The Joint EO for Health and Education Smt. Sada Bhargavi inspected various projects under TTD umbrella on Friday evening.

As part of it she observed the Covid awareness classes in SVETA Bhavan. Later,she inspected Dasa Sahitya, Nalayira Divya Prabandha and Alwar Divya Prabandha, Srinivasa Kalyanam and SV Vaibhavotsavam, Purana Ithihasa, Sri Sreenivasa Telugu Vangmaya Projects at SVETA Bhavan along with Central Library located in the building.

Project officers Dr C Rajagopalan, Sri. PR Anandatheertha Charyulu, SVETA Director Sri Ramanjulu Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ప్రాజెక్టులను తనిఖీ చేసిన జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుపతి, 2020 న‌వంబ‌రు 13: తిరుపతిలోని శ్వేత భవనంతోపాటు టిటిడి ప్రాజెక్టులను జెఈవో(విద్య మ‌రియు ఆరోగ్యం) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి శుక్రవారం తనిఖీ చేశారు.

శ్వేత భవనంలో కోవిడ్ – 19పై టిటిడి ఉద్యోగులకు జరుగుతున్న ఆన్ లైన్ అవ‌గాహ‌న తరగతులను  పరిశీలించారు. ఆదేవిధంగా శ్వేత భవనంలో గల కేంద్రీయ గ్రంథాలయం మరియు పరిశోధనా కేంద్రం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ద్రవిడ వేద నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకం, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, శ్రీ శ్రీనివాస తెలుగు వాఙ్మయ అధ్యయన సంస్థ, దాస సాహిత్య ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణం మరియు ఎస్వీ వైభవోత్సవం ప్రాజెక్టులను తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లో కోవిడ్-19 నేపథ్యంలో అనుసరిస్తున్న విధి విధానాలను పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

జెఈఓ వెంట ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య రాజగోపాలన్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు, శ్వేత సంచాల‌కులు డా. కె.రామాంజుల‌రెడ్డి తదితరులు ఉన్నారు.
       
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.