TIRUMALA KARTHEEKA DEEPOTSAVAM ON DEC 11 _ డిసెంబ‌రు 11న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

డిసెంబ‌రు 11న తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం

తిరుమ‌ల‌, 2019 న‌వంబ‌రు 18: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 11వ తేదీన సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.00 గంటల నుండి 8.00 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనందనిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆతర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖరపడి, రాములవారిమేడ, ద్వారపాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణమండపం, సభఅర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగనరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండివాకిలి, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవను టిటిడి రద్దు చేసింది.

పౌర్ణమి గరుడసేవ రద్దు :

కార్తీక పర్వదీపోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబ‌రు 11న శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ రద్దయింది. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 18 Nov. 19: TTD is organising grand Karteeka Deepotsavam at Srivari temple on December 11 after completing the evening daily rituals in the temple.

As part of the event lamps with ghee buds will be lighted   and paraded with Sattumora and Mangala vadyams in the vimana pradakshina of ananda nilayam followed by srivari harati.

Later on Karteeka deepams will be lighted all over the Srivari temple including garbhalayam upto vendi vakili and beyond up to Swami Pushkarani, Bedi Anjaneya, Sri Varahaswami temple in Tirumala.

   In view of unique event of Kartheeka Deepotsavam, the TTD has cancelled the Sahasra Dipalankara seva and the Pournami Garuda vahanam in the evening.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI