GOKULASHTAMI ASTHANAM ON AUGUST 12 & UTLOTSAVAM ON AUGUST 13 AT TIRUMALA _ తిరుమలలో ఆగస్టు 12న గోకులాష్టమి ఆస్థానం, 13న ఉట్లోత్సవం

Tirumala, 8 Aug. 20: On the occasion of Sri Krishna Janmashtami on August 12, TTD is organising the Asthanam at the Srivari temple in ekantham in view of COVID-19 restrictions.

The Asthanam will be held near Bangaru vakili in the evening between 6pm and 8pm when utsava idols of Sri Krishna and His consort were seated on the golden Sarvabhoopala vahanam. The utsava idols of Sri Urga Srinivasamurthy and others will be rendered Tirumanjanam and Dwadasaradhanam as well in Ekantam.

UTLOTSAVAM ON AUGUST 13

As part of the annual festival of Utlotsavam on August 13, Asthanam will be held at Ranganayakula Mandapam for utsava idols of Sri Malayappa Swamy and Sri Krishna Swamy after a grand procession on Bangaru Tiruchi inside Srivari temple in the evening.

It may be recalled that the annual festival was a feast for devotees as the procession of utsava idols was conducted on Mada streets to the dancing and striking of butter vessels hung high on the streets by the youth.

But this year both festivals of Gokulastami Asthanam and Utlotsavam will be conducted in Ekantham in view of Covid-19 restrictions.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో ఆగస్టు 12న గోకులాష్టమి ఆస్థానం, 13న ఉట్లోత్సవం

తిరుమల, 2020 ఆగ‌స్టు 8: తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 12వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు.  అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.

ఆగస్టు 13న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించ‌కుని సాయంత్రం 4 నుండి 6 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు.  

కాగా, ప్ర‌తి ఏడాది తిరుమ‌లలో ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హార‌తులు స్వీక‌రిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. కానీ ఈ ఏడాది  కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.