EXTENSIVE INSPECTIONS BY TTD EO _ తిరుమలలో టిటిడి ఈవో విస్తృత తనిఖీలు

Tirumala, 23 April 2022: In the backdrop of spiralling devotees rush to Tirumala for Srivari Darshan, TTD EO Dr KS Jawahar Reddy along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Narasimha Kishore conducted an extensive inspection at Tirumala.

Initially, they inspected the medical facilities available for devotees at Vaikunta Queue complex-2, devotees queue lines, luggage counters, scanning equipment, free dispensary and Anna Prasadam kitchen etc.

They also reviewed queue movement conditions, precautions needed cleanliness of toilets in cellars etc at Vaikunta queue complex-1.

Thereafter at Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Bhavan they inspected the food items given to devotees and also facilities at PAC-1,2,3, Kalyan Katta, lockers allotment system, facilities to devotees at dormitories etc.

DyEO Sri Ramesh Babu, Smt Padmavati, Sri Bhaskar, Sri Raman Rao, VGO Sri Bali Reddy, Health Officer Dr Sri Devi, DFO Sri Srinivasulu Reddy, Garden Deputy Director Sri Srinivasulu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో టిటిడి ఈవో విస్తృత తనిఖీలు

తిరుమ‌ల‌, 23 ఏప్రిల్ 2022: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దృష్టిలో టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి శనివారం అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ తో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2లో భక్తుల క్యూలైన్లు, లగేజీ డిపాజిట్ కౌంటర్లు, స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. అక్కడి ఉచిత వైద్యశాలలో భక్తులకు అందుతున్న వైద్యసేవలు తనిఖీ చేశారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు పంపిణీ చేసేందుకు అన్నప్రసాదాలు తయారు చేసే వంటశాలను పరిశీలించారు. కంపార్ట్మెంట్ల నిర్వహణ, కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి వదలడం, తోపులాటలు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో సెల్లార్ లో మరుగుదొడ్ల పరిశుభ్రతను తనిఖీ చేశారు.

అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అందుతున్న ప్రసాదాల వితరణ విధానాన్ని, వంటశాలను పరిశీలించారు. ఆ తర్వాత పిఎసి-1, 2, 3లలో భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. కళ్యాణకట్ట, లాకర్ల కేటాయింపు విధానం, డార్మిటరీల్లో భక్తులకు కల్పించిన వసతులను పరిశీలించారు.

ఈవో వెంట డెప్యూటీ ఈఓలు శ్రీ రమేష్ బాబు, శ్రీ హరీంద్రనాథ్, శ్రీమతి పద్మావతి, శ్రీ భాస్కర్, శ్రీ రామారావు, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులురెడ్డి, గార్డెన్ డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.