CHITRAKOOT PONTIFF HAILS ANJANEYA BHUMI PUJA _ భూమి పూజలో పాల్గొన‌డం పూర్వ జ‌న్మ సుకృతం : చిత్రకూట్ పీఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ రామభద్రాచార్యులు

Tirupati, Feb.15 2022: Pontiff of Chitrakoot Peetham Sri Sri Sri Ramabhadracharyulu on Tuesday hailed his participation in the Bhumi puja of Anjaneya birthplace development works at Tirumala as a blessing of his past birth deeds.

Speaking to reporters after visiting the Go Pradakshina mandir at Alipiri along with Visakha Sharada peetham Pontiff Sri Sri Sri Swaroopananda Saraswati Swamiji, the visiting Pontiff said Go Puja ahead of Srivari Darshan brings many boons and hailed the yeomen service-oriented programs of TTD.

Earlier both the pontiffs went round the Go Thulabharam, Saptha Go Pradakshina mandir and performed puja of Sri Venugopal Swami.

Additional EO Sri AV Dharma Reddy, Chennai local advisory committee president Sri Sekhar Reddy, CVSO Sri Gopinath Jatti, Goshala director Dr Harinath Reddy and SV higher Vedic studies institute project officer Sri Vibhishana Sharma were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భూమి పూజలో పాల్గొన‌డం పూర్వ జ‌న్మ సుకృతం : చిత్రకూట్ పీఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ రామభద్రాచార్యులు

తిరుప‌తి, 2022 ఫిబ్ర‌వ‌రి 15: తిరుమల అంజనాద్రిలో హనుమంతుని జన్మస్థలం అభివృద్ధి ప‌నుల‌ భూమి పూజలో పాల్గొన‌డం త‌న‌ పూర్వ‌జ‌న్మ సుకృత‌మ‌ని చిత్రకూట్ పీఠాధిపతి శ్రీశ్రీ‌శ్రీ‌ రామభద్రాచార్యులు ఆనందం వ్య‌క్తం చేశారు. అలిపిరి వ‌ద్ద గ‌ల టిటిడి సప్త గో ప్రదక్షిణ మందిరాన్ని మంగ‌ళ‌వారం సాయంత్రం స్వామిజీ, విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామితో క‌లిసి ద‌ర్శించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా శ్రీశ్రీ‌శ్రీ‌ రామభద్రాచార్యులు మీడియాతో మాట్లాడుతూ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి ముందు గో పూజ నిర్వ‌హించ‌డం వ‌ల‌న విశేష ఫ‌లితం ఉంటుంద‌న్నారు. గో సంర‌క్ష‌ణ కోసం టిటిడి బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంద‌ని అభినందించారు.

అంత‌కుముందు స్వామిజీలు సప్త గో ప్రదక్షిణ మందిరంలోని గోవులకు, శ్రీ వేణుగోపాల స్వామివారికి పూజ‌లు నిర్వ‌హించి, గో తులాభారంను ప‌రిశీలించారు.

అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, చెన్నై స‌ల‌హామండ‌లి అధ్య‌క్షులు శ్రీ శేఖ‌ర్ రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, గోశాల డైరెక్ట‌ర్ డా. హ‌రినాథ్ రెడ్డి, ఎస్వీ ఉన్న‌త వేద ఆధ్య‌య‌న సంస్థ ఆధికారి శ్రీ విభీష‌ణ శ‌ర్మ పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.