TTD DENIES CLAIMS ON HANUMAN BIRTHPLACE _ మా విస్తృత పరిశోధనల ఆధారాలతోనే అంజనాద్రి ఆంజనేయుని జన్మ స్థలంగా ప్రకటించాము : టీటీడీ

Tirumala, 25 Apr. 21: The TTD on Sunday denied reports in print, electronic and social media that its recent declaration on the birthplace of Sri  Hanuman was based on reports provided by other scholars.

In a statement, TTD said a scholars committee was set under the chairmanship of Prof V Muralidhar Sharma, Vice-chancellor of National Sanskrit University to study the issue in detail. The committee made vigorous research on evidences gathered from Puranic anthologies, epigraphically sources, literary scripts and geographical details as indicated in 12 Puranas and epic texts.

The findings of the scholars committee submitted to TTD in a final report were announced at Tirumala in the presence of Honourable Governor of Tamilnadu, His Excellency Sri Banwarilal Purohit on the Sri Ramanavami day, April 21.

Thereafter scores of scholars have sprung up from nowhere and are making claims that the “ research reports submitted to TTD by them long ago” was the basis for the announcement made by TTD on April 21.

The TTD reiterated its declaration on Anjanadri hillock in Tirumala as the birthplace of Hanuman, which was an outcome of vigorous research made by the scholars committee set up TTD only.

TTD said that all claims in media by others were totally baseless and allegedly motivated for propaganda with bad intentions.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మా విస్తృత పరిశోధనల ఆధారాలతోనే అంజనాద్రి ఆంజనేయుని జన్మ స్థలంగా ప్రకటించాము :  టీటీడీ           
ఏప్రిల్‌ 25, తిరుమల 2021: శ్రీ ఆంజనేయస్వామి జన్మస్థలాన్ని పరిశోధించడానికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతులైన ఆచార్య వి.మురళీధర శర్మ  అధ్యక్షతన టిటిడి ఎన్నో రంగాల్లో నిష్ణాతులైన పండితులతో పరిషత్ ను ఏర్పాటు చేసింది. ఈ పరిషత్ గత నాలుగు నెలలుగా ఈ విషయాన్ని పరిశోధించి పురాణ, వాంగ్మయ, శాసన, చారిత్రక ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రే  శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మస్థలమని నిరూపిస్తూ  రిపోర్టును మాకు సమర్పించింది. ఈ రిపోర్టునే శ్రీరామనవమి నాడు (21 – 4 – 2021)  నాదనీరాజన మండపంపై టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి , తమిళనాడు గవర్నర్ శ్రీ భన్వరి‌లాల్ పురోహిత్ సమక్షాన పాత్రికేయులందరి ముందు తగిన మౌఖిక వివరణలతో ఆవిష్కరించారు.
కానీ కొంతమంది పండితులు వార్తాపత్రికలు, టీవీ చానళ్లలో దీనికి విరుద్ధంగా మాట్లాడుతూ “ మేము ఈ విషయంలో పరిశోధించి టిటిడికి ఎన్నో సంవత్సరాల ముందే సమర్పించిన రిపోర్టు ఆధారంగా చేసుకునే జన్మస్థలాన్ని ప్రకటించారు” అని మాట్లాడుతున్నారు. కానీ వారి ఈ వాదన పూర్తిగా నిరాధారమే గాక స్వార్థంతో కూడుకున్నది అని తెలియజేస్తూ మా ఈ  జన్మస్థలానికి సంబంధించిన ప్రకటన మా పండిత పరిషత్ సమర్పించిన రిపోర్టును  ఆధారంగా చేసుకున్నదే అని నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాము.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.