మ‌న్నారుపోలూరులోని శ్రీ స‌త్య జాంభ‌వ‌తి స‌మేత శ్రీ అల‌గు మ‌ల్లారి కృష్ణ‌స్వామివారి ఆలయానికి పుష్పాలు, పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు

మ‌న్నారుపోలూరులోని శ్రీ స‌త్య జాంభ‌వ‌తి స‌మేత శ్రీ అల‌గు మ‌ల్లారి కృష్ణ‌స్వామివారి ఆలయానికి పుష్పాలు, పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు

తిరుపతి, 2019 జూన్ 05: టిటిడికి అనుబంధంగా ఉన్ననెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మండ‌లం, మ‌న్నారుపోలూరులోని శ్రీ స‌త్య జాంభ‌వ‌తి స‌మేత శ్రీ అల‌గు మ‌ల్లారి కృష్ణ‌స్వామివారి ఆలయాలకు 2019-20 సంవత్సరానికి గాను పాలు, పెరుగు, పుష్పాలు, తమలపాకులు, అరటిపండ్లు, తదితర వాటిని సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

పుష్పాలు, తమలపాకులు, అరటిపండ్లు టెండ‌ర్ కొర‌కు ‘టిటిడి ఈవో, తిరుపతి’ పేరిట రూ.300/-, పాలు, పెరుగు టెండ‌ర్ కొర‌కు రూ.100/-, డిడి తీసి షెడ్యూళ్ల ద‌ర‌ఖాస్తులు పొంద‌వ‌చ్చు. జూన్ 17వ తేది ఉద‌యం 11.00 నుండి మ‌ధ్యాహ్నం 12.00 గంటలలోపు తిర‌నుప‌తిలోని పురంద‌ర దాస్ కాంప్లెక్స్‌లో గ‌ల శ్రీ స‌త్య జాంభ‌వ‌తి స‌మేత శ్రీ అల‌గు మ‌ల్లారి కృష్ణ‌స్వామివారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయంలో టెండరు దరఖాస్తును పొందవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సీల్డ్ టెండర్లను తెరుస్తారు. టెండర్లలో పాల్గొనదలచిన పాలు, పెరుగు స‌ర‌ఫ‌రా వారు ఈఎండీ రూ.3000-, పుష్పాలు, తమలపాకులు, అరటిపండ్లు, త‌దిత‌ర స‌ర‌ఫ‌రా వారు రూ.10,000- చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు తిర‌నుప‌తిలోని పురంద‌ర దాస్ కాంప్లెక్స్‌లో గ‌ల శ్రీ స‌త్య జాంభ‌వ‌తి స‌మేత శ్రీ అల‌గు మ‌ల్లారి కృష్ణ‌స్వామివారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారివారి కార్యాలయంలో సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.