JAPA YAGNAM REACHES FIFTH DAY _ రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం

Tirumala, 20 Mar. 20: Srinivasa Veda Mantra Arogya Japa Yagnam has reached the fifth day in Tirumala on Friday.

The vedic pundits across the country recited Arogya Mantras prescribed in Chaturvedas at Ranganayakula Mandapam in Srivari temple.

This fete will conclude on March 25.

SV Higher Vedic Studies Project Officer Dr Akella Vibhishana Sharma is supervising the religious activity.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం

తిరుమల, 2020 మార్చి 20తిరుమ‌ల‌లో జ‌రుగుతున్న‌ శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌పయ‌జ్ఞం శుక్ర‌వారం 5వ రోజుకు చేరుకుంది. శుక్ర‌వారం నుండి ఈ జ‌ప‌య‌జ్ఞాన్ని శ్రీ‌వారి ఆల‌యంలో రంగ‌నాయ‌కుల మండ‌పంలో నిర్వ‌హిస్తున్నారు.

ప్ర‌పంచ మాన‌వాళికి అశాంతిని, ఆనారోగ్యాన్ని దూరం చేసి స‌ర్వ‌తోముఖాభివృద్ధిని ప్ర‌సాదించాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తూ ఈ జ‌ప‌య‌జ్ఞాన్ని నిర్వ‌హిస్తున్నారు. దీనివ‌ల్ల సంపూర్ణ ఆరోగ్యం, పుష్టి, సుఖ‌శాంతులు చేకూరుతాయ‌ని వేద‌పండితులు చెబుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల‌కు చెందిన 30 మంది వేద పండితులు దీక్ష‌గా వేద‌మంత్ర జ‌ప‌య‌జ్ఞం నిర్వ‌హిస్తున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ ఇత‌ర టిటిడి అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.