TTD MULLS STATE WIDE CELEBRATIONS OF SRAVANA POURNAMI, VARALAKSHMI VRATAM AND KRISHNASTAMI FESTIVITIES _ రాష్ట్ర వ్యాప్తంగా శ్రావ‌ణ పౌర్ణ‌మి, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, కృష్ణాష్ట‌మి వేడుక‌లు

TIRUPATI, 17 AUGUST 2021: As a part of Sravana Masa festivities, all projects of TTD in co-ordination should observe Sravana Pournami, Varalakshmi Vratam and Krishnastami events across the state, said TTD Additional EO Sri AV Dharma Reddy.

A review meeting on all projects of TTD was held in Sri Padmavathi Rest House at Tirupati on Tuesday evening by the Additional EO. He directed the HDPP officials to prepare guidelines for the training to be imparted to the Dharma Prachara co-ordinators in the state. All the Tirunakshatram programmes performed under the aegis of Alwar Divya Prabandha Project of TTD should also be carried out in a grand manner involving all projects, he added.

He said the Sapthagiri magazine should be revived completely under the guidance of the Editorial Board with attractive pages, content and stories. Similarly, the publications which will strengthen the Publication Wing should be identified and republished.

He said about 2000 sankeertans of Sri Annamacharya should be brought to the public fore by composing music and the selection of talented artists for the same should be carried out from time to time. Similarly the Dasa Sankeertans should also be popularized among masses and instructed the officer concerned to arrange a meeting with experts in Dasa Sahitya soon.

The Additional EO instructed all Project officers, to prepare an action plan for yearly events for their respective projects and submit the same by next review meeting.  “All the project officers should focus on bringing out new programmes involving the public and taking forward the Hindu Sanatana Dharma Prachara in an effective manner”, he maintained.

TTD Projects Programme Officer, Sri Vijaya Saradhi, SVBC CEO Sri Suresh Kumar, Dasa Sahitya Project Special Officer Sri Anandatheerthacharyulu, Annamacharya Project In-charge Director Dr Vibhishana Sharma, Sapthagiri Magazine Chief Editor Sri Radha Ramana were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రాష్ట్ర వ్యాప్తంగా  శ్రావ‌ణ పౌర్ణ‌మి, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, కృష్ణాష్ట‌మి వేడుక‌లు

–  అన్ని ప్రాజెక్టుల స‌మ‌న్వ‌యంతో కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌
   
టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి ధ‌ర్మారెడ్డి

తిరుపతి, 2021 ఆగ‌స్టు 17: శ్రావ‌ణ మాస ఉత్స‌వాల్లో భాగంగా నిర్వ‌హించే శ్రావ‌ణ పౌర్ణ‌మి, వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, కృష్ణాష్ట‌మి వేడుక‌లు టిటిడిలోని అన్ని ధార్మిక ప్రాజెక్టుల స‌మ‌న్వ‌య స‌హ‌కారంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేయాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

తిరుప‌తి శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సాయంత్రం అద‌న‌పు ఈవో అన్ని ప్రాజెక్టుల అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలోని హిందూ ధ‌ర్మ ప్ర‌చార ప‌రిష‌త్ కో-ఆర్డినేట‌ర్ల‌ శిక్ష‌ణకు సంబంధించి విధి విదానాల‌ను త‌యారు చేయాల‌ని హెచ్‌డిపిపి అధికారుల‌ను ఆదేశించారు. ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే తిరున‌క్ష‌త్రం కార్య‌క్ర‌మాల‌ను అన్ని ప్రాజెక్టుల స‌మ‌న్వ‌యంతో క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హించాల‌న్నారు. ఎడిటోరియ‌ల్ బోర్డు స‌హ‌కారంతో స‌ప్త‌గిరి మాస ప‌త్రిక చ‌క్క‌టి కంటెంట్, శీర్షిక‌లు ప్ర‌చురించాల‌న్నారు. అలాగే ప‌బ్లికేష‌న్ విభాగాన్ని బ‌లోపేతం చేసి చక్క‌టి ప్ర‌చుర‌ణ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు.

రెండేళ్ళ‌ల్లో వెయ్యి అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను స్వ‌ర‌ప‌రిచి ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని, ఇందుకోసం స్వ‌ర‌క‌ర్త‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని చెప్పారు. దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా క‌న్న‌డ భాష‌లో సంకీర్త‌న‌లు స్వ‌ర‌ప‌ర‌చ‌డానికి స్వ‌ర‌క‌ర్త‌ల‌తో త్వ‌ర‌లో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారికి సూచించారు. వ‌చ్చే స‌మావేశం నాటికి ప్ర‌తి ప్రాజెక్టు ఏడాదిలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి క్యాలెండ‌ర్ త‌యారు చేసి తీసుకురావాల‌న్నారు. ప్ర‌తి ప్రాజెక్టు అధికారి త‌మ ప్రాజెక్టుకు సంబంధించిన‌ ప‌రిశోధ‌న‌లు, స‌రికొత్త ప్ర‌చుర‌ణ‌లు తీసుకురావ‌డంపై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు. అన్ని ప్రాజెక్టులు స‌మ‌న్వ‌యంతో నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల్లో భ‌క్తుల‌ను భాగ‌స్వాముల‌ను చేసి విజ‌య‌వంతం చేయాల‌న్నారు.

టిటిడి ప్రాజెక్టుల ప్రోగ్రాం ఆఫీస‌ర్ శ్రీ విజ‌య‌సార‌ధి, ఎస్వీబీసి సిఈవో శ్రీ సురేష్‌కుమార్, దాస సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థ‌చార్యులు, అన్న‌మాచార్య ప్రాజెక్టు ఇన్‌చార్జ్ సంచాల‌కులు శ్రీ విభీష‌ణ‌ శ‌ర్మ‌, స‌ప్త‌గిరి మాస ప‌త్రిక చీఫ్ ఎడిట‌ర్ శ్రీ రాధా ర‌మ‌ణ‌, పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.