DAY-2- VASANTHOTSAVAM AT SRIVARI TEMPLE _ రెండో రోజు వసంతోత్సవాలు

రెండో రోజు వసంతోత్సవాలు
ఏప్రిల్‌ 25, తిరుమల 2021: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం రెండో రోజు ఏకాంతంగా జరిగాయి.
సాధార‌ణంగా వ‌సంతోత్స‌వాల్లో రెండో రోజు స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. క‌రోనా వ్యాధి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా టిటిడి రద్దు చేసింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఆల‌యంలోని క‌ల్యాణ మండపానికి వేంచేపు  చేశారు. మధ్యాహ్నం 2 నుండి 4  గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వార్ల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేప‌డ‌తారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 25 Apr. 21: The second-day festivities of the annual Vasantothsavam were conducted at Srivari temple on Sunday also in ekantham following Covid guidelines.

As the TTD has cancelled the traditional Swarna Rathotsavam seva in view of Covid, the utsava idols of Sri Malayappa and his consorts were first seated in Kalyana mandapam and later rendered grand Snapana thirumanjanam abhisekam.

Later in the evening after the Asthanam, the utsava idols were paraded on the Mada streets amidst Mangala vadyam and Veda mantras.

The Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyarswamy and Sri Sri Sri Chinna Jeeyarswamy, Temple DyEO Sri Harindranath, other Archakas and officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI