DEVOTEES THRONG GARUDA SEVA AT SRINIVASA MANGAPURAM _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

DEVOTINALLY EXHILARATING GARUDA SEVA AT SKVST

Srinivasa Mangapuram, 18 Feb. 20: The grand procession of Garuda vahana seva was the highlight of ongoing annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple of Srinivas Mangapuram on Tuesday evening .

Garuda is the favourite carrier of Lord Maha Vishnu and Sri Kalyana Venkateswara in all His resplendency blessed devotees who swarmed to witness His grandeur on Tuesday evening at the temple.

The colourful art forms in front of the Garuda Vahanam added beauty, charm and grandeur to the procession.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, TTD board members Sri Sekhar Reddy, ex-officio Sri C Bhaskar Reddy, JEO Sri P Basant Kumar,  Additional CVSO Sri Shiva Kumar Reddy, SE Sri Ramesh Reddy, DyEO Sri Yellapa and others were also present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి గరుడసేవ

తిరుపతి,  2020 ఫిబ్రవరి 18: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. రాత్రి 8.00 గంటల నుండి 10.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారుల వాయద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్ రెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, ఎస్ఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  శ్రీ చెంగ‌ల్రాయులు, ప్రధాన అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ కుమార్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.