MP CM OFFERS PRAYERS  _ శ్రీవారిని దర్శించుకున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌

Tirumala, 18 Nov. 20: The Honourable Chief Minister of Madhya Pradesh, Sri Sivaraj Singh Chouhan had offered prayers along with his family and entourage in the temple of Lord Venkateswara at Tirumala on Wednesday.

Earlier on his arrival at the entrance of the temple, he was received by TTD Additional EO Sri AV Dharma Reddy. After darshan he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam by Vedic Pundits. He was presented with Srivari Theertha Prasadams, lamination photo of Lord Venkateswara.

The CM of Madhya Pradesh later took part in Sundarakanda Parayanam at Nada Neerajana Mandapam.

CVSO Sri Gopinath Jatti, former TTD Board Member Sri Bhanuprakash Reddy, Temple DyEO Sri Harindranath, Temple Peishkar Sri Jaganmohanachary were also present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌

తిరుమల, 2020 నవంబరు 18: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ ముఖ్యమంత్రి గౌ|| శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ బుధ‌వారం ఉదయం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ముందుగా ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగతం పలికారు.

స్వామివారి ద‌ర్శ‌నానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు వేద‌పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం అద‌న‌పు ఈఓ స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.

అనంత‌రం నాద‌నీరాజ‌నం వేదికపై జ‌రిగిన సుంద‌ర‌కాండ పారాయ‌ణంలో గౌ|| ముఖ్యమంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ భానుప్ర‌కాష్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జగన్ మోహనాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.