VYASARAYA MUTT SEER OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వ్యాసరాజ మఠాధిపతి  శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ

Tirumala, 14 Dec. 20: The 41st Pontiff of Vyasaraya Mutt, Sri Sri Vidyashreesha Teertha Swamiji offered prayers in Tirumala temple on Monday.

He was received at the Sacred Fig tree located near Old Annaprasadam Complex as per temple traditional honours (Pedda Maryada). Later EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy welcomed the seer, while the archakas took the Pontiff to Bedi Anjaneya Swamy temple with Isthikapal honours.

TTD Board Members Sri Govindahari, Sri DP Ananta, Deputy EO Sri Harindranath, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ
తిరుమల, 2020   డిసెంబరు 14: కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన శ్రీ వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ సోమ‌వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు  చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి‌ ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీ వ్యాసరాజ మఠానికి 41వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ కొనసాగుతున్నారు. 8 శతాబ్దాలకు పైగా చరిత్ర గల ఈ మఠం వ్యవస్థాపకులు శ్రీమద్‌ ఆనందతీర్థ భగవత్పాదులవారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డి.పి.ఆనంత, శ్రీవారి డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, ఒఎస్‌డి పాల శేషాద్రి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.