WHOPPING 6.02 LAKH DEVOTEES GET SRIVARI DHARSHAN – DYEO SRI HARIDRANATH _ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట – దాదాపు 6.02 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం : ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌

Tirumala, 7 Oct. 19: TTD had successfully provided Srivari Mulavirat darshan to a record number of 6.02 lakh common devotees during the seven days of the ongoing Srivari Annual Brahmotsavams at Tirumala, said the DyEO of Srivari Temple Sri Harindranath.

Speaking at Media center on Monday morning he said common devotees darshan is given priority during Brahmotsavams by slashing the VIP break and the Rs.300 special entry tickets and all arjitha sevas and privilege darshans.

TTD made elaborate queue line streamlining mechanism and deployed efficient crowd management strategies to ensure that the devotees get faster and smooth darshan of both presiding deity as well vahana sevas.

During the brahmotsavams the hundi collections also recorded a peak figure of Rs.17.97 crores. TTD had kept a buffer stock of 8.5 lakh laddu prasadam but in last seven days a record of 30.15 lakh laddus have been sold by the TTD.

He said, special efforts were made to make the vahana sevas more attractive and devotional quotient multiplied under the direction of TTD EO Sri Anil Kumar Singhal and Additional E O Sri A V Dharma Reddy which had succeeded in achieving a smooth, trouble-free and devotee happy Brahmotsavams, he maintained.

TTD PRO Dr. T Ravi, Potu Peishkar Sri Srinivasulu and other senior officials participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట్ట –  దాదాపు 6.02 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం :  ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌

తిరుమల, 2019 అక్టోబ‌రు 07:  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 6.02 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ తెలిపారు.

రాంభగీచా 2లోని మీడియా సెంటర్‌లో సోమ‌వారంనాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు.

శ్రీవారి హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 17.97 కోట్లు లభించినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా  8.5  లక్షల లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు వివరించారు. శ్రీవారి భక్తులకు ఇప్పటి వరకు 30.15 లక్షల లడ్డూలు అందించినట్లు తెలియజేశారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో ప్రత్యేకంగా అలంకరణలు చేశామ‌న్నారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి నేతృత్వంలో అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో  టిటిడి ప్ర‌జాసంబంధాల అధికారి డా.టి.ర‌వి,పేష్కార్‌ శ్రీ శ్రీ‌నివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.