శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో ఘ‌నంగా లక్ష్మీ కాసులహారం ఊరేగింపు

శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో ఘ‌నంగా లక్ష్మీ కాసులహారం ఊరేగింపు

తిరుమ‌ల‌, 2019 నవంబరు 27: తిరుమల శ్రీవారి ఆల‌య మాడ వీధుల్లో బుధ‌వారం ఉద‌యం లక్ష్మీ కాసులహారం ఊరేగింపు ఘ‌నంగా జ‌రిగింది. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ఈ హారాన్ని ఊరేగించారు. అనంత‌రం తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి అలంక‌రించేందుకు తీసుకెళ్లారు. తిరుచానూరులోని ప‌సుపు మండ‌పం వ‌ద్ద ఆల‌య అధికారుల‌కు అప్ప‌గించారు. అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా బుధ‌వారం గజవాహనం, గురువారం గరుడవాహన సేవల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి ల‌క్ష్మీ కాసుల‌హారాన్ని అలంక‌రిస్తారు.

మాడ వీధుల్లో జ‌రిగిన ఊరేగింపులో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, పేష్కార్ శ్రీ లోక‌నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.