PAVITRA SAMARPANA IN SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో పవిత్ర సమర్పణ

Tirupati, 17 Jul. 20: On second day of the ongoing Annual Pavitrotsavam at the TTD local temple of Sri Kodandarama Swamy Temple, the holy ritual of Pavitra samarpana was performed with religious fervour after morning daily practices as Ekantham in view of COVID-19 restrictions

The utsava idols of Sri Sitarama and Lakshmana were brought to yagashala where the rituals of Of snapana thirumanjanam were performed and Pavitras submitted to all deities and other holy places like Homa Kundam, dwajastambham etc.

  TTD EO Sri Anil Kumar Singhal, Spl Gr DyEO Smt Parvathi, Chief Priest of Sri KRT Sri Anandkumar Deekshitulu, AEO Sri Durga Raju, Superintendent Sri Ramesh, Temple Inspector Sri Ramesh and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో పవిత్ర సమర్పణ
తిరుప‌తి, 17 జూలై 2020: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం పవిత్ర సమర్పణ చేపట్టారు. టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ప‌విత్రోత్స‌వాలు ఏకాంతంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ ఆనంద‌కుమారాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ర‌మేష్ పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.