JYESTABHISHEKAM BEGINS AT SRI GT _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం ప్రారంభం

Tirupati, 1 Jul. 20: The annual Jyestabhisekam festival at Sri Govindaraja Swamy Temple commenced in Ekantham inside temple premises in view of Covid-19 restrictions on Wednesday.

With the Temple archaka Sri A T Chakravarti Seshadri Dikshitulu as Kankana Bhattar the Shatakalasa Snapana, Maha Shanti Homa were performed ahead of Snapana Tirumanjanam for utsava idols of Sri Govindarajaswami and his consorts.

Thereafter special pujas were performed at the Mandapam for kavacham before the Kavachadhivasam ritual was conducted.

Later in the evening the utsava idols were taken out in a procession within the temple prakaram.

Sri Sri Sri Pedda Jeeyangar and Sri Sri Sri Chinna Jeeyangar Swamys, EO Sri Anil Kumar Singhal, Special Grade Dy EO Smt Varalakshmi and others present.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం ప్రారంభం

తిరుపతి, 2020 జూలై 01: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్టాభిషేకం బుధ‌వారం ప్రారంభమైంది. ప్రతి ఆషాఢ మాసంలో జ్యేష్టా నక్షత్రం నుంచి శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ కార్యక్రమాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు. ఆల‌య అర్చ‌కులు శ్రీ ఎటి.చ‌క్ర‌వ‌ర్తి శేషాద్రి దీక్షితులు కంక‌ణ‌భ‌ట్టార్‌గా వ్య‌వ‌హ‌రించారు.

ఇందులో భాగంగా ఉద‌యం శ‌త‌క‌ల‌శ‌స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. ఆ త‌రువాత ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని తిరుచ్చిపై ఆలయ విమాన ప్రాకారంలో ఊరేగింపు చేప‌డ‌తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయంగార్‌, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్నజీయంగార్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఇవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.