ELABORATE ARRANGEMENTS OF ACCOMMODATION MADE _ సామాన్య భ‌క్తుల‌కు గ‌దుల కేటాయింపున‌కు పెద్ద‌పీట : వ‌స‌తి క‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి కోనేటి పార్వ‌తి, శ్రీ జి.బాలాజి

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సామాన్య భ‌క్తుల‌కు గ‌దుల కేటాయింపున‌కు పెద్ద‌పీట : వ‌స‌తి క‌ల్ప‌న విభాగం డెప్యూటీ ఈవోలు శ్రీ‌మ‌తి కోనేటి పార్వ‌తి, శ్రీ జి.బాలాజి

అక్టోబరు 05, తిరుమ‌ల‌, 2019:   శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేసి గ‌దులు కేటాయించామ‌ని టిటిడి వ‌స‌తి క‌ల్ప‌న విభాగం ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి కోనేటి పార్వ‌తి, డెప్యూటీ ఈవో శ్రీ జి.బాలాజి తెలియ‌జేశారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో శ‌నివారం వారు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డెప్యూటీ ఈవోలు మాట్లాడుతూ బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆన్‌లైన్ కోటా త‌గ్గించామ‌ని, సిఫార్సు లేఖ‌ల‌ను స్వీక‌రించ‌లేద‌ని తెలిపారు. భ‌క్తులు త్వ‌ర‌గా గ‌దులు ఖాళీ చేసి ఇత‌ర భ‌క్తుల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశామ‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో విధులు నిర్వ‌హించేందుకు విచ్చేసిన టిటిడి డెప్యుటేష‌న్ అధికారుల‌కు, సిబ్బందికి, పోలీసుల‌కు, ఆర్‌టిసి, అగ్నిమాప‌క‌, అట‌వీ విభాగాలకు, మీడియా ప్ర‌తినిధుల‌కు గ‌దులు కేటాయించామ‌ని వెల్ల‌డించారు. పిఏసి-1లో 1256, పిఏసి-2లో 3300, పిఏసి-3లో 1850, ప‌ద్మ‌నాభ నిల‌యంలో 812 లాక‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. ఇటీవ‌ల ప్రారంభించిన మాతృశ్రీ వ‌కుళాదేవి విశ్రాంతి గృహంలో 270 గ‌దులున్నాయ‌ని, రూ.1000/- అద్దెగా నిర్ణ‌యించామ‌ని చెప్పారు. ఆన్‌లైన్‌లో మూడు నెల‌ల ముందుగా గ‌దులు బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించామ‌ని, ఇందులో రూ.100/- అద్దె గ‌ల గ‌దులు 900, రూ.500/- గ‌దులు 300, రూ.600/- గ‌దులు 200, రూ.1000/- గ‌దులు 100 ఉన్నాయ‌ని తెలియ‌జేశారు.

 ఈ మీడియా స‌మావేశంలో టిటిడి పిఆర్వో డా.టి.ర‌వి, ఎపిఆర్వో కుమారి పి.నీలిమ‌, రిసెప్ష‌న్ ఏఈవో శ్రీ కె.మోహ‌న్‌రాజు పాల్గొన్నారు.

టిటిడి  ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 5 Oct. 19: To ensure safe accommodation to visiting pilgrims during brahmotsavams,  TTD has taken all measures by setting up separate counters for pilgrims,  locals and employees said,  Reception wing DyEOs Sri Balaji and Smt Parvathi.

Briefing the media at Media Center on Saturday,  the Reception 1 DyEO Sri Balaji said on total 753 AC rooms are available in Tirumala out of which nearly 420 rooms are allotted to pilgrims on regular basis while 230 rooms available in on-line through Advanced Reservation Process(ARP). While another 58 under permanent accommodation.

Cashless transactions have been enabled with the introduction of Swiping Machines at the accommodation booking counters,  he added.

Briefing on general accommodation,  the Special Grade DyEO of R2 and R3 Smt Parvathi said, there are 6000 rooms under the reception wing.

Besides,  there are 1256 lockers available in PAC 1,  3300 in PAC 2,  1850 in PAC 3,  812 in Padmanabha Nilayam out of which PAC 1 and 2 are allotted to pilgrims alone during brahmotsavams while PAC 3 and Padmanabha Nilayam to men and women police respectively drafted for Brahmotsavam bundobust duty.

Apart from PACs,  on October 2,  Matrusri Vakulamata Rest House is also opened with 270 rooms which are also brought under use for pilgrims,  she said.

AEO Sri Mohan Raju was also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI