MALAYAPPA AS VENKATADRI RAMUDU RIDES ON HANUMANTHA VAHANAM _ హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు

Tirumala, 24 Sep. 20: On the sixth day morning as a part of the ongoing annual Brahmotsavams at Tirumala, Sri Malayappaswami donned the Avatara of Sri Venkatadri Ramudu and blessed devotees on Hanumanta Vahanam on Thursday.

Hanumanta vahanam is usually considered as an icon of devotional bliss.

Lord Hanuman symbolically stands for pure devotion, complete surrender and absence of ego. His character tells us what we can do in our lives by becoming pure. Hanuman represents the tenets of devotion and Sharanagathi in its both physical mans intellectual form.

Sri Malayappa Swamy by riding Hanumantha Vahana sent message to His devotees that He is always there with those who completely shower pure love towards Him leaving aside their egos.

TTD EO Sri Anil Kumar Singhal, Board members Sri Ananta, Sri Siva Kumar, Sri Govindhari, Sri DP Anantha, Sri Sekhar Reddy, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
హ‌నుమంత వాహ‌నంపై వేంక‌టాద్రిరామునిగా శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు
తిరుమ‌ల‌, 2020 సెప్టెంబరు 24: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురు‌‌వారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు వేంక‌టాద్రిరాముని అలంకారంలో దర్శనమిచ్చారు.
హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి
హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.
కాగా, సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా స‌ర్వ‌భూపాల వాహ‌నసేవ జ‌రుగుతుంది. రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షిస్తారు.
వాహనసేవల‌లో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌,  ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు డా.నిశ్చిత‌, శ్రీ శేఖ‌ర్ రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి అనంత‌, సిఇ శ్రీ ర‌మేష్‌రెడ్డి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, రవాణా విభాగం జిఎం శ్రీ శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.