10th EDITION OF SUNDARAKANDA AKHANDA PARAYANAM ON FEBRUARY 21 _ ఫిబ్ర‌‌వ‌రి 21న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 10వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 13 Feb. 21: As part of spiritual campaign against pandemic Covid Virus the TTD is organising the 10th edition of Sundarakanda Akhanda Parayanam at Nada Neeranjanam platform in Tirumala on February 21.

As many as 200 Vedic pundits including those from Dharmagiri Veda Vijnan Peetham, SV Vedic University, National Sanskrit university and TTD Veda Parayanadars will recite 188 shlokas of 39-44 chapters of Sundarakanda next Sunday between 7am and 9am.

The SVBC channel will live telecast the parayanam for benefit of devotees.

Sundarakanda to complete 250 days by Feb 15

The Sundarakanda Pathanam which won the accolades of millions and millions if devotees across the world will complete 250 days on Monday, February 15.

Magha Bhanu puja on February 14.

As part of Magha Masam festivities, TTD is organising the Magha Bhanu Puja on February 14, Sunday at Dharmagiri Veda Vijnana Peetham in Tirumala between 8am and 10am seeking good health to be bestowed on the entire humanity.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఫిబ్ర‌‌వ‌రి 21న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 10వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2021 ఫిబ్ర‌‌వ‌రి 13: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఫిబ్ర‌వ‌రి 21వ తేదీన 10వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

ఆది‌వారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 188 శ్లోకాలను పారాయణం చేస్తారు. తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

సుంద‌ర‌కాండ పారాయ‌ణానికి 250 రోజులు

తిరుమ‌లలో నిర్వ‌హిస్తున్న సుంద‌ర‌న‌కాండ పారాయ‌ణం ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ సోమ‌వారానికి 250 రోజులు పూర్తి అవుతుంది.    

ఫిబ్ర‌వ‌రి 14న మాఘ‌భాను పూజ‌
ప‌విత్ర మాఘ‌మాసంను పుర‌స్క‌రించుకొని ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ ఆదివారం ఉద‌యం 9  నుండి 10 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో మాఘ‌భాను పూజ జ‌రుగ‌నుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.