32nd BATCH ARCHAKA TRAINING ENDS AT SVETA_ శ్వేతలో ముగిసిన 32వ బ్యాచ్‌ అర్చక శిక్షణ
By TTD News On 15 Aug, 2019 At 04:47 PM | Categorized As General News

Tirupati, 15 Aug. 19: The valedictory session of training program held under aegis of HDPP for the 32nd batch of SC/ST/BC Archakas held from August 1-15 was held on Thursday at SVETA complex.

Speaking in the occasion the TTD Joint Executive Officer Sri P Basant Kumar said, the trained Archakas should observe traditional Dharmic discipline in work and function with social responsibility.

He said the training of 33rd batch would commence from tomorrow till August 25 and initiatives underway to enhance number of trainees in future. He also presented certificates, puja materials, Srivari portraits, and prasadam to the 45 trained archakas.

HDPP secretary Dr Ramana Prasad, Archaka training co-ordinator Dr P Chenchu Subbaiah and others participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్వేతలో ముగిసిన 32వ బ్యాచ్‌ అర్చక శిక్షణ

తిరుపతి, 2019 ఆగష్టు 15: ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు నిర్వహించిన 30వ బ్యాచ్‌ అర్చక శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఆగష్టు 1 నుండి 15వ తేదీ వరకు ఈ తరగతులు నిర్వహించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో ముగింపు కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్ మాట్లాడుతూ అర్చకుడు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాచరణ వైపు ప్రజలను నడిపించాలన్నారు. ఆలయాల్లో నిర్దేశించిన సమయంలో క్రమం తప్పకుండా క్రమశిక్షణతో పూజలు నిర్వహించాలని సూచించారు. అర్చక శిక్షణలో ధర్మం, దేవాలయం, అర్చకత్వం, అర్చకుడు – సమాజ భాగస్వామ్యం తదితర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఆగస్టు 16 వ తేదీ నుండి 25వ తేది వరకు 33 వ బ్యాచ్‌ అర్చక శిక్షణ ప్రారంభంకానుందని, భవిష్యత్తులో మరింత ఎక్కువ మందికి అర్చక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతరం శిక్షణ పొందిన 45 మంది అర్చకులకు పూజాసామగ్రి, ధ్రువీకరణపత్రం, శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి డా|| రమణప్రసాద్‌, అర్చక శిక్షణ కో-ఆర్డినేటర్‌ డా|| పమిడికాల్వ చెంచుసుబ్బయ్య పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v