57,804 ONLINE SEVA TICKETS AVAILABLE FOR NOVEMBER – TTD EO_ డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

PILGRIMS LAUDS ONLINE DIP SYSTEM

Tirumala, 4 August 2017: A total of 57,804 online quota of Arjitha Seva tickets are available for pilgrims for the month of November, said TTD EO Sri AK Singhal.

Before taking the calls from pilgrims during monthly “Dial your EO” program, the EO informed the pilgrims about the availability of Seva tickets in online quota.
“Among these tickets, those under electronic dip comprise 10,049 which includes Suprabhatam-7,269; Thomala-120; Archana-120; Astadalam-240; Nijapada-2,300 while the General online arjitha seva tickets are 47,725 which includes Kalyanotsavam-10,875; Unjal Seva-2,900; Arjitha Brahmotsavam-6,235; Vasanthotsavm-12,470; Sahara Deepalankaram-13,775 and Visesha Puja-1,500

The pilgrim caller poured in appreciation on TTD EO and his team for the new electronic dip system of allotment of arjitha Seva tickets.

DEVELOP AKHANDA HARINAMA SANKEERTANA PLATFORM ON THE LINES OF NADA NEERAJANAM

The stage of Akhanda Hari Nama Sankeertana in Tirumala should be declared on the lines of Nada Neerajanam, sought a pilgrim caller Sri Buchi Reddy from Warangal.

During the monthly “Dial your EO” programme a pilgrim caller requested the TTD EO to give boost to Akhanda Harinama Sankeertana, where the bhajans are being rendered by artistes hailing from different Telugu states 24X7. Replying the caller the EO said, he will look into the issue.

PROVIDE DEVOTIONAL CDs

Another caller Sri Siddharth from Vijayawada said , TTD is providing Mike sets on subsidy to temples in villages over representation from the concerned temple organisers. “In a similar manner, please distribute the CDs recorded by TTD also to the temples, so that we can play them during festivals”. Reacting to the caller, the EO assured him of positive initiative.

ENHANCE SECURITY ALONG FOOTPATHS

A pilgrim caller Sri Venu from Hyderabad suggested EO to improve security check along foot path routes. “Your vigilance sleuths are doing very good security check in all places. But improve the same in footpath routes also”, he added.

Answering the caller, the EO said, there is a dearth of security personnel. However he assured the pilgrim, that his suggestion is well taken and he will see the improvements soon.

ALLOW SINGLE OR COUPLE OF PERSONS FOR SRIVARI SEVA

A pilgrim caller Sri Ravi from Nizamabad sought the EO to allow single or two people for Srivari Seva voluntary service in Tirumala, for which the EO replied it is not possible and a team should have at least ten members for easy allocation of services and orientation.

ENHANCE CLEANLINESS AT SRIVARI PADALU

Another caller Sri Balaji from Tirupati brought to the notice of EO, to improve cleanliness in Srivari Padalu area in Tirumala. The EO replied him his suggestion well received.

CONSTRUCT KALYANA MANDAPAM IN SINGANUR

A pilgrim caller Syam Kumar from Karnataka sought the EO to construct a kalyana Mandapam in Singanur of Raichur district in Karnataka. The EO said it is not feasible at present.

IMPROVE QUALITY OF PANCHALOHA VIGRAHAMS

Pilgrim callers Sri Venkat Reddy and Sri Yadaiah informed EO to improve the standards of the Panchaloha vigrahas prepared by TTD as their faces are not clear. The EO said, he will look into the issue.

PERFORM KALYANAMS IN NORTH INDIA ALSO

A pilgrim caller Sri Srinivas from Hyderabad sought TTD EO to perform Kalyanams of Swamy vary in North India also for which the EO answered that TTD is doing Kalyanams as per the requests from devotees from that place in the country as well abroad.

PREVENT DEVOTEES FROM KEEPING CHAPPALS IN FRONT OF GOPURAM

A devotee Smt Kalavidya from Chennai brought to the notice of TTD EO that some pilgrims are leaving chappals in front of the temple at Tiruchanoor and it should be taken care of. The EO said necessary measures will be immediately taken to solve the issue.

ONLINE BOOKING FOR AGED

A devotee Uday Bhaskar from Visakhapatnam sought the EO whether any online booking provision for aged people also. The EO said, TTD is allocating specified Darshan slots to aged pilgrims, when the rush is lean.

IMROVE SEVAS IN TIRUCHANOOR

Sri Rajesh from Hyderabad sought the EO to improve the performance of sevas in Tiruchanoor for which the EO said he will pursue with the officials concerned.

ENGLISH SCROLLING ALSO

Dr Mayuri from Pune sought EO to scroll the information on SVBC in English also for the sake of non-Telugus, the EO said they pursue the issue. “You can also log on to our website to get the information”, he added.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆన్‌లైన్‌లో 57,804 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల :

‘డయల్‌ యువర్‌ ఈవో’లో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుమల, 04 ఆగస్టు 2017 : నవంబరు నెలకు సంబంధించి మొత్తం 57,804 శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్‌ టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్టు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,049 సేవా టికెట్లను విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,269, తోమాల 120, అర్చన 120, అష్టదళపాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 2,300 టికెట్లు ఉన్నాయన్నారు. అదేవిధంగా, ఆన్‌లైన్‌లో సాధారణ ఆర్జిత సేవా టికెట్లు 47,755 ఉన్నాయని, వీటిలో కల్యాణోత్సవం 10,875, ఊంజల్‌ సేవ 2,900, ఆర్జితబ్రహ్మూెత్సవం 6,235, వసంతోత్సవం 12,470, సహస్రదీపాలంకార సేవ 13,775, విశేష పూజ 1,500 టికెట్లు ఉన్నాయని వివరించారు.

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

1. మయూరి – పుణె.

ప్రశ్న: తిరుమలలో ఇంగ్లీషు, హిందీ భాషల్లోనూ సూచికబోర్డులు ఏర్పాటుచేయండి?

ఈ.వో: తిరుమలలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో సూచికబోర్డులు ఏర్పాటుచేస్తున్నాం. టిటిడికి సంబంధించిన ఇతర వివరాల కోసం వెబ్‌ సైట్‌ను చూడగలరు.

2. ఉదయభాస్కర్‌ – విశాఖ.

ప్రశ్న: వృద్ధుల దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చా?

ఈ.వో: వృద్ధులు, దివ్యాంగుల దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే అవకాశం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు 750 మందికి, మిగిలిన రోజులలో ఉదయం, మధ్యాహ్నం కలిపి 15 వందల మందికి దర్శనం కల్పిస్తున్నాం. ఈ నెలలో 22, 29 తేదిలలో రోజుకు 4 వేల మందికి దర్శనం టికెట్లను జారీ చేస్తాం.

3. గిరీశం – తిరుపతి, మాధవయ్య – చిత్తూరు.

ప్రశ్న: సర్వదర్శనం ఆలస్యమవుతోంది, కొద్దిసేపు స్వామివారి ముందు నిలబడి దర్శనం చేసుకునే అవకాశం కల్పించండి?

ఈ.వో: సర్వదర్శనంలో తాము ఎలాంటి మార్పులు చేపట్టలేదు. రద్దీ దృష్ట్యా భక్తులను నిలిపి స్వామివారి దర్శనం కల్పించడం సాధ్యంకాదు.

4. సిద్ధార్థ్‌ – విజయవాడ

ప్రశ్న: టిటిడి నుంచి సబ్సిడి ద్వారా మైక్‌సెట్‌లు పొందిన ఆలయాలకు మనగుడి కార్యక్రమంలో కంకణాలతో పాటు స్వామివారి సంకీర్తనల సిడిలను పంపండి?

ఈ.వో: తప్పక పంపుతాం.

5. వేంకటేశ్వర్లు – ప్రకాశం

ప్రశ్న: తిరుమలలో వివాహం చేసుకోవడం ఎలా?

ఈ.వో: తిరుమలలోని కల్యాణవేదికను ఆన్‌లైన్‌లో రిజర్వు చేసుకోవచ్చు.

6. ఏడుకొండలు – నెల్లూరు

ప్రశ్న: టిటిడి డైరీలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

ఈ.వో: శ్రీవారి బ్రహ్మూెత్సవాలనాటికి అందుబాటులోకి తెస్తాం.

7. రాజేష్‌ – హైదరాబాద్‌, చెన్నె – కళావిద్య

ప్రశ్న: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సేవలు మరింత మెరుగ్గా నిర్వహించండి? గోపురం ఎదుట పాదరక్షలు ఉంచకుండా చూడండి?

ఈ.వో: పరిశీలించి మరింత మెరుగుపరుస్తాం. గోపురం వద్ద పాదరక్షలు ఉంచకుండా చర్యలు తీసుకుంటాం.

8. వేణు – హైదరాబాద్‌

ప్రశ్న: నడకమార్గాలలో సెక్యూరిటి పెంచి తనిఖీలు చేపట్టండిి?

ఈ.వో: త్వరలో సిబ్బందిని పెంచి తగిన భద్రతా చర్యలు చేపడుతాం.

9. రవి – నిజామాబాద్‌

ప్రశ్న: శ్రీవారి సేవకు ఒకరిని లేదా ఇద్దరిని అనుమతించండి?

ఈ.వో: కనీసం పది మంది కలిసి బృందంగా శ్రీవారి సేవకు రావచ్చు.

10. బాలాజీ – తిరుపతి

ప్రశ్న: శ్రీవారి పాదాల వద్ద పరిశుభ్రతను పెంచండి?

ఈ.వో: పరిశుభ్రతను పెంచుతాం. ఆయా మార్గాలలో సీనియర్‌ అధికారులతో తరచూ పారిశుద్ధ్య చర్యలను పర్యవేక్షిస్తాం.

11. తులసీరాం – మిర్యాలగూడ, దుర్గాదేవి – రాజమండ్రి.

ప్రశ్న: రూ.50 దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచండిి?

ఈ.వో: ప్రస్తుతం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహాలో కాలినడక భక్తులకు టైం స్లాట్‌ ప్రకారం త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. భక్తులు వినియోగించుకోగలరు.

10. రవితేజ – తిరుపతి

ప్రశ్న: టిటిడిలో ఉద్యోగాల నోటిఫికెేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారు?

ఈ.వో: అవసరాన్ని బట్టి పత్రికలలో ప్రకటనలు జారీ చేస్తాం.

11. మురళీకృష్ణ – కొత్తగూడెం, సూర్యనారాయణ – హైదరాబాద్‌.

ప్రశ్న: కల్యాణకట్టలో సిబ్బంది డబ్బులు అడుగుతున్నారు? పుష్కరిణి వద్ద స్నానపు గదులలో నీటి కొళాయిలు సక్రమంగా ఉండేలా చూడండి?

ఈ.వో: కల్యాణకట్టలో సిబ్బందిపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులతో విచారణ చేపడుతున్నాం. పుష్కరిణి వద్ద నీటి కొళాయిలను సరిచేస్తాం.

12. శ్యాంకుమార్‌ – కర్నాటక, సింగనూర్‌

ప్రశ్న: మా ప్రాంతంలో శ్రీవారిఆలయం, కల్యాణమండపం నిర్మించండి?

ఈ.వో: అన్ని రాష్ట్రాల రాజధానులలో శ్రీవారి ఆలయాలను నిర్మిస్తున్నాం.

13. వెంకటరెడ్డి, యాదయ్య – హైదరాబాద్‌

ప్రశ్న: టిటిడి నుంచి విగ్రహాలు ఎలా పొందాలి, పంచలోహ విగ్రహాల ముఖాకృతి సరిగా ఉండటం లేదు?

ఈ.వో: టిటిడి నుంచి విగ్రహాలు పొందే విధానాన్ని మా అధికారులు ఫోన్‌లో తెలియజేస్తారు. పంచలోహ విగ్రహాల ముఖ ఆకృతిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం.

14. శ్రీరాం, వేంకటేశ్వర్‌ రావు – విశాఖ, జగన్మోహన్‌ – అనంతపురం.

ప్రశ్న: శ్రీవారి ఆర్జిత సేవలలో ఇద్దరికి మించి అనుమతించండి?

ఈ.వో: ఆర్జితసేవలకు ఇద్దరిని అనుతిస్తున్నాం. 12 ఏళ్లలోపు పిల్లలు వారితోపాటు ఉచితంగా రావచ్చు.

15. శ్రీనివాస్‌ – హైదరాబాద్‌

ప్రశ్న: ఉత్తర భారతదేశంలో కూడా స్వామి వారి ఉత్సవాలు నిర్వహించండి?

ఈ.వో: భక్తుల వినతి మేరకు దేశ, విదేశాలలో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నాం.

16. చక్రపాణి – కడప

ప్రశ్న: బ్రహ్మూెత్సవాల సమయంలో రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శనం టికెట్లను ఇవ్వండి?

ఈ.వో: ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రద్దు చేశాం.

18. బుచ్చిరెడ్డి – వరంగల్‌

ప్రశ్న: అఖండ హరినామ సంకీర్తన వేదికను నాదనీరాజనం తరహాలో అభివృద్ధిచేయండి ?

ఈ.వో: తగిన చర్యలు చేపడుతాం.

డయల్‌ యువర్‌ ఈవో ముఖ్యాంశాలు

డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ముందుగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే…

2. శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు :

– ఈ ఏడాది సెప్టెంబరు 23 నుండి అక్టోబరు 1వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మూెత్సవాలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాహనసేవలతో పాటు శ్రీవారి మూలమూర్తిని భక్తులు సంత ప్తికరంగా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు, బస, లడ్డూ ప్రసాదం తదితర వసతులు కల్పించేందుకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

3. ఆగస్టు 7న చంద్రగ్రహణం :

– చంద్రగ్రహణం కారణంగా ఆగస్టు 7వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 2 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేస్తారు.

– గ్రహణం సమయంలో మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన భవనంలో అన్నప్రసాద వితరణ ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.

4. వ ద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ప్రత్యేక దర్శనం :

– ఆగస్టు 22, 29వ తేదీల్లో వ ద్ధులు, దివ్యాంగులకు ఉదయం 10 గంటలకు వెయ్యి మందికి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల మందికి, మధ్యాహ్నం 3 గంటలకు మరో వెయ్యి మందికి కలుపుకుని 4 వేల మందికి దర్శన టోకెన్లు జారీ చేస్తాం.

– ఆగస్టు 23, 30వ తేదీల్లో 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 2 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తాం.

5. కాలినడక భక్తులకు టోకెన్ల ద్వారా దర్శనం :

– కాలినడక భక్తులకు జూలై 17 నుండి కాలినడక భక్తులకు నడకమార్గాల్లో టోకెన్ల జారీ చేస్తున్నాం. భక్తులు వారికి కేటాయించిన టైమ్‌స్లాట్‌ ప్రకారం క్యూలైన్‌లోకి ప్రవేశిస్తే మరలా వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నాం. అలిపిరి మార్గంలో 14 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేలు టోకెన్లు కలిపి ఒక రోజుకు మొత్తం 20 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం.

– కాలినడక భక్తుల సౌకర్యార్థం అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేస్తున్నాం. ఇక్కడ సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు అందుబాటులో ఉండి భక్తులకు అవసరమైన సూచనలు, ఇతర సమాచారాన్ని అందిస్తారు.

6. గదుల కేటాయింపులో పారదర్శకత :

– తిరుమలలో గదుల కోసం భక్తులు ఎక్కువసేపు క్యూలో వేచి ఉండకుండా, మరింత పారదర్శకంగా ఉండేందుకు జూలై 12వ తేదీ నుండి టోకెన్ల జారీ విధానం ద్వారా గదులు కేటాయిస్తున్నాం. ఒక రోజుకు 2500 నుంచి 2700 గదులను భక్తులు వినియోగించుకున్నారు.

– టోకెన్ల జారీ కోసం సిఆర్‌వో కార్యాలయం వద్ద 10 కౌంటర్లు ఏర్పాటుచేశాం. నమోదు చేసుకున్న భక్తులకు గదుల కేటాయింపు సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తున్నాం.

7. కల్యాణకట్టలో క్షురకులపై క్రమశిక్షణా చర్యలు :

– ఇటీవల కల్యాణకట్టలోని క్షురకులపై భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులపై ఉన్నతాధికారులతో విచారణకు ఆదేశించాం. నివేదిక రాగానే సదరు క్షురకులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం.

ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఎ.రవికృష్ణ, ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, ఎస్‌ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.