ACHARYA RITWIK VARANAM PEROFRMED_ శాస్త్రోక్తంగా శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

Srinivasa Mangapuram, 8 Jun. 19: The Agama ritual, Acharya Ritwik Varanam was performed with celestial fervour in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Saturday followed by Ankuraropanam in the night as a part of the Astabandhana Balalaya Maha Samprokshanam scheduled from June 9 to 13.

TTD Executive Officer Sri Anil Kumar Singhal who took part in this sacred fete said that the Balalayam event will be performed once in 12 years and TTD is been conducting this religious event in all its prime temples.

As a part of the highly traditional Agama event, the Kalakarshana event will be performed on the night of June 9 wherein the power in the presiding deity will be transferred into a holy pot through the way of Agama rituals. On June 12, Maha Shanti Tirumanjanam will be performed to Sri Kalyana Venkateswara Swamy and the power will be retransmitted into the Mula Virat.
On June 13 morning Maha purnahuti and Maha Samprokshanam will be conducted and later on darshan will be provided for devotees.

About 25 Homa Gundas are installed and 41 Ritwiks from AP, Telangana, Karnataka and Tamil Nadu are participating in this sacred event.

DyEO Sri Dhananjeyulu, Srivari temple Chief priest Sri Venugopal Dikshitulu,Vaikhanasa Agama advisers Sri Sundara Vadanacharyulu, Sri Mohana Rangacharyulu, Sri Ananta Sayana Dikshitulu, temple DyEO Sri Dhananjayulu, AEO Sri Lakmaiah, temple priest Sri Balaji Rangacharyulu ,Superintendent Sri Chengalrayulu and others were also present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు అంకురార్పణ – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్

తిరుప‌తి, 2019 జూన్ 08: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా శ‌నివారం ఉద‌యం ఈవో ఋత్విక్‌ వరణంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో ప్ర‌తి 12 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. గ‌తంలో 2007వ సంవత్సరం టిటిడి ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింద‌న్నారు.

ఇందులో భాగంగా జూన్ 9వ తేదీ రాత్రి 8.00 గంటలకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తార‌ని తెలిపారు. అదేవిధంగా జూన్‌ 12న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి మహాశాంతి తిరుమంజనం నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. జూన్‌ 13న ఉదయం ”మహాపూర్ణాహుతి, ఉదయం 7.30 నుండి 9.00 గంటల వరకు మహాసంప్రోక్షణ జ‌రుగుతుంద‌న్నారు. అనంత‌రం ఉదయం 11.00 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించ‌నున్న‌ట్లు తెలిపారు. యాగ‌శాల‌లో వైధిక కార్య‌క్ర‌మాల‌కు ఇబ్బంది లేకుండా భ‌క్తుల‌ను స్వామివారి ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ వైధిక కార్య‌క్ర‌మానికి యాగశాలలో 25 హోమగుండాలు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 41 మంది రుత్వికులు పాల్గొంటున్నార‌ని తెలిపారు. అదేవిధంగా టిటిడి స్థానిక ఆల‌యాల ఆర్జిత సేవ‌లు ఆన్‌లైన్‌లో ఉంచ‌డం వ‌ల‌న భ‌క్తులు ముంద‌స్తుగా బుక్ చేసుకుని సేవ‌ల‌లో పాల్గొంటున్న‌ట్లు తెలిపారు.

అంత‌కుముందు ఈవో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఇందులో భాగంగా శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయ ప్రాంగ‌ణంలో సిద్ధం చేసిన శ్రీవారి అష్ట‌బంధ‌న యాగ‌శాల‌, శ్రీ రంగ‌నాథ‌స్వామి యాగ‌శాల‌, శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ యాగ‌శాల‌ల‌ను ప‌రిశీలించారు.

ఋత్విక్‌ వరణం :

ఆలయంలో శనివారం ఉదయం ఋత్విక్‌వరణం జరిగింది. ముందుగా 41 మంది ఋత్వికులు, వారి సహాయకులు, ఇతర వేదపారాయణందారులు శ్రీవారి ఆజ్ఞ తీసుకున్నారు. ఆ తరువాత ఋత్వికులకు యాగగుండాల వద్ద స్థానాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆశీర్వదించిన వస్త్రాలను ఋత్వికులకు అందజేశారు. ఈ వస్త్రాలను పసుపునీటిలో తడిపి ఋత్వికులు దీక్షా వస్త్రాలుగా ధరిస్తారు. ఐదు రోజుల పాటు జరిగే యాగశాల కార్యక్రమాల్లో మాత్రమే ఈ పసుపు వస్త్రాలను ఋత్వికులు ధరిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాలదీక్షితులు, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హ‌దారులు శ్రీ సుంద‌రవ‌ర‌ద బ‌ట్టాచార్య‌లు, శ్రీ‌ మోహ‌న రంగాచార్యులు, శ్రీ అనంత‌శ‌య‌ణ దీక్షితులు, టిటిడి శ్రీ‌నివాస వాజ్ఞ్మ‌య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ మేడ‌సాని మోహ‌న్‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్‌, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.