ADDITIONAL EO REVIEWS WITH SRIVARI POTU WORKERS _ పోటు కార్మికుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం

Tirumala, 12 Dec. 19: Additional Executive officer Sri A V Dharma Reddy urged Srivari Potu workers  to ensure against recurrence of fire accidents in laddu boondi potu as it would hurt the sentiments of devotees.

Addressing the Potu workers at Vaibhavotsava Mandapam on Thursday  he said human error leading to fire accidents in Srivari Potu would damage reputation of TTD as devotees believe laddu as most sacred after Lord.

He said all Potu workers should follow a  standard operating procedure(SOP) soon to be prepared by the health, fire services and Srivari temple officials.

Srivari temple DyEO Sri Harindranath, AEO Potu Sri Srinivasulu,  potu workers participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పోటు కార్మికుల‌తో అద‌న‌పు ఈవో స‌మావేశం

డిసెంబరు 12, తిరుమ‌ల‌, 2019: శ్రీ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాలు త‌యారుచేసే పోటు కార్మికుల‌తో టిటిడి అద‌నపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గురువారం తిరుమ‌ల‌లోని వైభ‌వోత్స‌వ మండ‌పంలో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ‌వారి భ‌క్తులు ల‌డ్డూ ప్ర‌సాదాన్ని ఎంతో ప‌విత్రంగా భావిస్తార‌ని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పోటు కార్మికులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో విధులు నిర్వ‌హించాల‌ని కోరారు. మాన‌వ త‌ప్పిదాల‌తో బూందీ పోటులో అగ్నిప్రమాదాలు జ‌రుగుతుండ‌డంతో భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తినే ప్ర‌మాద‌ముంద‌న్నారు. అగ్ని ప్ర‌మాదాలు పున‌రావృతం కాకుండా చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. అగ్నిమాప‌క విభాగం, ఆరోగ్య విభాగం, ఆల‌య అధికారులు అందించిన సూచ‌న‌లతో ఒక నిర్దిష్ట‌మైన విధానాన్ని రూపొందిస్తామ‌ని, పోటు కార్మికులు ప్ర‌తి ఒక్క‌రూ ఈ విధానాన్ని పాటించాల‌ని కోరారు.

ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పోటు విభాగం అధికారులు, పోటు కార్మికులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.