తిరుపతి పరిపాలన భవనంలోని మోడల్ ఆఫీస్ ను పరిశీలించిన జెఈఓ
By TTD News On 13 May, 2019 At 07:56 PM | Categorized As General News

తిరుపతి పరిపాలన భవనంలోని మోడల్ ఆఫీస్ ను పరిశీలించిన జెఈఓ

మే 13, తిరుపతి, 2019: టిటిడి తిరుపతి పరిపాలన భవనంలోని మోడల్ ఆఫీస్ ను జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం సోమవారం పరిశీలించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా మోడల్ ఆఫీస్ ను తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి కీర్తనలు వినిపించేలాని, టిటిడి ఆలయాలలోని దేవతామూర్తుల చిత్రాలు కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉద్యోగులకు అత్యాధునిక హంగులతో కార్యాలయాన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. గాలి, వెలుతురు, లైటింగ్, కుర్చీలు, పచ్చదనం కోసం కిటికీల పక్కన మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. మోడల్ ఆఫీస్ తరహాలో పరిపాలన భవనంలోని ఇతర కార్యాలయాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఈ 1 శ్రీ రమేష్ రెడ్డి, డిఈ శ్రీ రవిశంకర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతి టిటిడి మ్యూజియంను పరిశీలించిన జెఈఓ

తిరుపతిలోని టిటిడి మ్యూజియంను జెఈఓ శ్రీ బి.లక్ష్మీకాంతం సోమవారం పరిశీలించారు. మ్యూజియంకు సందర్శకులు పెరిగేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి గాంధీరోడ్ మార్గంలో టిటిడి మ్యూజియంకు వెళ్లేందుకు వీలుగా దారి ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారును ఆదేశించారు. సందర్శకులు సులవుగా గుర్తించేందుకు వీలుగా సూచిక బోర్డులు, మ్యూజియం సందర్శన సమయం తెలిపేలా బోర్డులు, పెయింటింగ్, అవసరమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. మ్యూజియం చుట్టూ మరింత పరిశుభ్రతను పాటించాలన్నారు. మ్యూజియంను జెఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీ మనోహరం, ఏవీఎస్వో శ్రీ రాజేష్, మ్యూజియం అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v