ALL ARRANGEMENTS IN PLACE FOR VONTIMITTA KALYANAM_ శ్రీ సీతారాముల కల్యాణానికి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
By TTD News On 15 Apr, 2019 At 09:08 PM | Categorized As General News

LASER SHOW AT ALIPIRI ON CHORDS

PHONE IN PROGRAM WITH JEO ON APRIL 26

Tirupati, 15 Apr. 19: The arrangements for the big fete, Sita Rama Kalyanam which will be.performed on April 18 at Vontimitta in Kadapa district are in place, said Tirupati JEO Sri B Lakshmi Kantham.

Reviewing with officials in the conference hall of TTD administrative building in Tirupati on Monday evening he said, there should not be any compromise on the facilities that are to be provided to a multitude of visiting pilgrims for the celestial occasion on that day at Vontimitta.

He said, 150 counters have been set up to distribute food with the help of srivari seva volunteers. Apart from this enough quantity of water and buttermilk packers are also kept ready to meet the needs of scores of pilgrims who turn up for kalyanam on April 18, he added.

LASER SHOW

After visiting Akshardham and observing laser show there, we are contemplating to have one such show at Alipiri,.He maintained. The JEO said, as a part of spiritual beautification of the temple city, a dozen Shankha-Chakra-Nama tower boards are coming up soon from Nandi circle to Alipiri circle. He said, said Sri Raman and Sri Dhamam projects are also in the offing to enhance spiritual feel in temple city, he added.

DIAL YOUR JEO

The interactive phone in programme, Dial your JEO named as ‘Bhaktulato Bhavadeeyudu’ will be held on April 26 between 8.30am and 9.30am, he added.

Due to Vontimitta Brahmotsavams, this programme which is to be conducted on the third Friday of every month has been postponed to the fourth Friday for this month. Devotees shall call 0877-2234777 and speak to JEO directly.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సీతారాముల కల్యాణానికి వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

ఏప్రిల్ 15, తిరుప‌తి, 2019: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్‌ 18న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల కోసం సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో సోమ‌వారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ శ్రీరాములవారి కల్యాణం కోసం శోభాయ‌మానంగా క‌ల్యాణ‌వేదిక తీర్చిదిద్దుతున్నామ‌ని, జ‌ర్మ‌న్ షెడ్ల ఏర్పాటు పూర్త‌యింద‌ని తెలిపారు. లక్ష మందికి పైగా భక్తులు విచ్చేసే అవ‌కాశ‌ముండ‌డంతో ఎలాంటి రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌న్నారు. భ‌క్తులంద‌రికీ అక్షింతలు అందిస్తామ‌ని, 150 కౌంట‌ర్ల ద్వారా అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. క‌డ‌ప‌ జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని పటిష్టమైన క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటుచేస్తున్నామ‌ని, టిటిడి విజిలెన్స్‌ అధికారులు కడప జిల్లా పోలీసు అధికారులు క‌లిసి ప‌టిష్టంగా బందోబ‌స్త్ ఏర్పాట్లు చేస్తున్నార‌ని వివ‌రించారు. భ‌క్తుల‌కు ర‌వాణా, వైద్య‌సేవ‌లు అందించేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు.

టిటిడి రోడ్ల‌కు హ‌రిత శోభ‌…

తిరుప‌తిలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై జెఈవో మాట్లాడుతూ తిరుపతిలో గ‌రుడ వార‌ధి ఉన్న రోడ్ల‌ను మిన‌హాయించి మిగిలిన 20 కి.మీ మేర ఉన్న టిటిడి రోడ్లకు హ‌రిత‌శోభ‌తోపాటు విద్యుత్‌ అలంకరణతో శోభాయ‌మానంగా శంఖుచక్రనామాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్ప‌టికే గ‌రుడ స‌ర్కిల్ నుండి నంది స‌ర్కిల్ వ‌రకు 12 పెద్ద శంఖుచక్రనామాల బోర్డుల ఏర్పాటు పూర్త‌య్యాయ‌ని, మిగిలిన రోడ్ల‌లో నెల రోజుల్లోపు ఈ ప‌నుల‌ను పూర్తి చేస్తామ‌ని తెలియ‌జేశారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వ‌ద్ద పాత అన్నదానం భవనంలో దాదాపు 600 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా సెల్లార్ అభివృద్ధి చేస్తున్నామ‌ని తెలిపారు. అమ్మ‌వారి ప్ర‌సాదాన్ని జ్యూట్ సంచుల్లో అందించేందుకు యోచిస్తున్నామ‌న్నారు. మే మొదటివారంలోపు శుక్రవారపు తోటలో శిల్పాలు మాట్లాడే విధంగా ఆగుమెంట్‌ రియాలిటి టెక్నాలజి సాయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లో పండుగలు, ఉత్సవాలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను పొందుపరుస్తామన్నారు. పండుగల విశిష్టతను తెలిపేలా డాక్యుమెంటరీలు రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేస్తామన్నారు. టిటిడి ఆల‌యాల్లో ఆభరణాలు చోరీకి గురికాకుండా ఆర్‌ఎఫ్‌ఐడి(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటి డివైజ్‌) సాయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు.

శ్రీ‌రామం, శ్రీ‌ధామం ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న‌….

ఢిల్లీలో అక్ష‌ర‌ధామ్‌లో లేజ‌ర్ షోను, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌స‌ర్‌లో 7డి ప్రొజెక్ష‌న్‌ను ప‌రిశీలించామ‌ని, వీటిని తిరుప‌తిలోని అలిపిరి వ‌ద్ద ఏర్పాటుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని జెఈవో తెలిపారు. శ్రీ‌రామం, శ్రీ‌ధామం ప్రాజెక్టు ద్వారా ఇలాంటివి ఏర్పాటు చేసేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌న్నారు. మే 10 నుండి ఛార్‌ధామ్ యాత్ర ప్రారంభం కానుండ‌డంతో భ‌క్తుల సౌక‌ర్యార్థం రిషికేష్‌లోని అన్న‌దాన స‌మాజం, క‌ల్యాణ‌మండ‌పంలో వ‌స‌తులు పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. ఆయా ప్రాంతాల్లో టిటిడి ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు.

ఏప్రిల్ 26న ”భక్తులతో భవదీయుడు ”

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల జెఈవో కార్యాలయంలో ఏప్రిల్ 26వ తేదీన ”భక్తులతో భవదీయుడు” కార్యక్రమం జరుగనుంది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు భక్తులు ఫోన్‌ ద్వారా నేరుగా సూచనలు, సలహాలు అందించవచ్చ‌ని జెఈవో తెలిపారు. ప్రతినెలా మూడో శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుతుంద‌ని, ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాలు ఉన్న కార‌ణంగా ఈ నెల‌లో మాత్రం నాలుగో శుక్ర‌వారం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. భక్తులు ఈ ఫోన్‌ నంబరును 0877-2234777 సంప్ర‌దించాల‌న్నారు.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీకోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం, నారాయణనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం తదితర టిటిడి స్థానికాలయాలు, తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, సత్రాల్లో సౌకర్యాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలని జెఈవో కోరారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీ ఎ.రాములు, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు, డెప్యూటీ ఈవోలు శ్రీ విజ‌య‌సార‌ధి, శ్రీ‌మ‌తి క‌స్తూరి, శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, శ్రీ‌మ‌తి ల‌క్ష్మీన‌ర‌స‌మ్మ‌, శ్రీ న‌టేష్‌బాబు, శ్రీ విజ‌య‌కుమార్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v