ALL QUEUE LINES AND ENTRY POINTS ARE EARMARKED- EO _ వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

Tirumala, 4 Jan. 20:We have earmarked the entry points for queue lines and also in mada streets for the convenience of the pilgrims, said, TTD EO Sri Anil Kumar Singhal.

The EO along with Additional EO Sri AV Dharma Reddy and CVSO Sri Gopinath Jatti convened a media conference at Annamaiah Bhavan in Tirumala on Saturday and briefed them on the arrangements for Vaikuntha Ekadasi and Dwadasi.

He said, on Vaikuntha Ekadasi day, the darshan commences at 2am and will lasts up to three hours for protocol VIPs and the darshan for common pilgrims starts at 5am on January 6. First all the VQC 2 compartments will be filled up followed by the sheds in Narayanagiri Gardens, later in Mada street galleries and finally in the queue lines at Kalyana Vedika. A concrete plan has been chalked out for the distribution of Annaprasadam and three lakh water bottles is kept ready at 172 locations for distribution to pilgrims, he added. The EO said on Vaikuntha Ekadasi Day there will be procession of Swarna Ratham between 9am and 11am while on second day on Dwadasi, the Swami Pushkarini Theertha Mukkoti will be observed and the Sudarshana Chakrattalwar will be offered Chakra Snanam in the holy waters between 4.30am and 5.30am.

The Additional EO said, the SRIVANI Trust donors will report at 10am and will finish off their darshan in less than an hour after commencement of their turn for darshan. He said they will report at VQC 1 and will be provided Maha Laghu Darshan along with any other common pilgrims on this auspicious day.

CVSO said, the devotees will be sent through Alwar Tank Rest House point into VQC 2 and later in to the sheds of Narayanagiri Gardens based on first come first basis. “The devotees who are joining will be sent through N1 Entry point near Medaramitta into the galleries of Mada Streets through W7 Gate. We have also deployed our men, police, sevaks and scouts to operate the queue lines in a systematic manner”, he added.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమల, 04 జ‌న‌వ‌రి 2020: తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాద‌శి, 7న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని, భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శ‌నివారం అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టితో క‌లిసి ఈవో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి విఐపిల‌కు, సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. జ‌నవరి 6న ఉదయం ధ‌నుర్మాస కైంక‌ర్యాల అనంత‌రం 2 గంటల నుండి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంద‌ని,  ఉదయం 5 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభిస్తామ‌ని చెప్పారు. విఐపిల‌తోపాటు సామాన్య భ‌క్తుల‌కు మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. జనవరి 5వ తేదీ ఉద‌యం నుండి భక్తులను క్యూలైన్ల‌లోకి అనుమతిస్తామ‌ని తెలిపారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, ఆ త‌రువాత నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, చివ‌ర‌గా క‌ల్యాణ‌వేదికలో భ‌క్తుల‌ను నింపుతామ‌న్నారు. క్యూలైన్ల‌లో ఎక్కువ సేపు నిల‌బ‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు చెప్పారు. భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, అల్పాహారం, తాగునీరు, టి, కాఫి పంపిణీకి ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేశామ‌ని, 172 ప్రాంతాల్లో 3 ల‌క్ష‌ల తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకున్నామ‌ని వివ‌రించారు. 9 ల‌క్ష‌ల ల‌డ్డూలు నిల్వ ఉంచిన‌ట్టు తెలిపారు.

టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలందించిన దాత‌ల‌కు  వైకుంఠ ఏకాద‌శికి 2500 మందికి, ద్వాద‌శికి 2500 మందికి అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. వీరు ఉద‌యం 10 గంట‌ల‌కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 వ‌ద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంద‌ని, మ‌హాల‌ఘు ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని తెలియ‌జేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్లు, మాడ వీధుల్లోని షెడ్లు, క‌ల్యాణ‌వేదికలో క‌లిపి 85 వేల మంది భ‌క్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేప‌ట్టామ‌న్నారు. షెడ్ల‌కు అనుబంధంగా మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేశామ‌న్నారు.

           టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ మొద‌ట వ‌చ్చే భ‌క్తుల‌ను ఆళ్వార్ ట్యాంక్ విశ్రాంతి గృహం వ‌ద్ద గ‌ల‌ ప్ర‌వేశమార్గం ద్వారా ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, ఆ త‌రువాత నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లోని షెడ్ల‌లోకి పంపుతామ‌న్నారు. ఆ త‌రువాత వ‌చ్చే భ‌క్తుల‌ను మేద‌ర‌మిట్ట వ‌ద్ద గ‌ల ఎన్‌1 ప్ర‌వేశ‌మార్గంలో డ‌బ్ల్యు 7 గేటు ద్వారా మాడ వీధుల్లోకి అనుమ‌తిస్తామ‌ని తెలిపారు. ద‌క్షిణ మాడ వీధిలో 6,500 మంది, ప‌డ‌మర మాడ వీధిలో 14,000 మంది, ఉత్త‌ర మాడ వీధిలో 19,000 మంది, తూర్పు మాడ వీధిలో 4,000 మంది భ‌క్తులు కూర్చునేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు. చివ‌ర‌గా వ‌చ్చే భ‌క్తుల‌ను క‌ల్యాణ‌వేదిక వ‌ద్ద అనుమ‌తిస్తామ‌ని తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.