ANANTHAPADMANABHA VRATAM OBSERVED IN TIRUMALA_ తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం
By TTD News On 5 Sep, 2017 At 05:34 PM | Categorized As Temple News

Tirumala, 5 September 2017: One of the important annual festivals, Sri Anantha Padmanabha Vratam was observed with religious fervour in the hill town of Tirumala on Tuesday.

According to temple scriptures, Lord Venkateswara is believed to be an incarnation of Lord Sri Maha Vishnu. As Anantha Padmanabha Swamy, yet another form of Lord is being described as “Sayanarupa”-in a state of reclining on Ananta-the 1000-hood mighty serpent king Adisesha, the festival is observed in grandeur in all Sri Vaishnava Khetras across the country.

The image of Anantapadmanabha Swamy is also located inside the main temple complex where the pilgrim can see Lord in reclining pose. As Tirumala temple tops the list of Sri Vaishnava Divya Desams, the festival is observed on Bhadrapada Sukla Chaturdasi day every year in Tirumala.

Meanwhile the chakrasnanam is performed four times in a year usually during brahmotsavams, rathasapthami, vaikunta dwadasi and Ananta Padmanabha Vratam.

The temple priests performed special puja to Sri Sudarshana Chakrattalwar in Swamy Pushkarini after the first bell on this auspicious day.

TTD EO Sri Anil Kumar Singhal, DyEO Sri Kodanda Rama Rao, Peishkar Ramesh were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభవ్రతం

తిరుమల, 05 సెప్టెంబరు 2017: తిరుమలలో మంగళవారం నాడు అనంత పద్మనాభవ్రతాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్థశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తరువాత శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులను ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్ళి శ్రీ వరాహస్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో విశేష అభిషేకం నిర్వహించిన తరువాత చక్రస్నానాన్ని నిర్వహించారు. అంతకు మునుపు ఆలయంలో శ్రీవారి పాదాల చెంత ఉంచిన అనంత పద్మనాభస్వామి వ్రతమునకు సంబంధించిన ఎరుపు పట్టుదారాలను టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ ధరించారు.

కాగా శ్రీ మహావిష్ణువు అనంతకోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉన్నదో అదేవిధంగా శయన మూర్తిగా శ్రీ అనంత పద్మనాభస్వామికి వైశిష్ఠ్యం కలదు. ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో అత్యంత ప్రధానంగా నిర్వహించడం ఆనవాయితీ. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో ఈ రోజు అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

కాగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, ఆనంత పద్మనాభవ్రతం పర్వదినాలలో మాత్రమే చక్రత్తాళ్వారులకు చక్రస్నానం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండ రామారావు, పేష్కార్‌ శ్రీ రమేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am