ANIMATED MYTHOLOGICAL CHARACTERS TO ENTERTAIN CHILDERN IN COMPARTMENTS_ టిటిడి సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష
By TTD News On 16 Apr, 2019 At 08:01 PM | Categorized As General News

Tirupati, 16 Apr. 19: Animated mythological serials are going to muse children in Vaikuntham Queue complex as TTD is contemplating to telecast them in LED screens in compartments.

This idea popped up when the TTD Executive Officer Sri Anil Kumar Singhal was reviewing with senior officers in TTD administrative building on Tuesday evening.

He directed officials to ensure that devotees stay in the Vaikuntam Queue Complex are made more logistics, information etc. about devotional circuits of temples in Tirumala and Tirupati. He advised the SVBC officials to telecast devotional, cartoons and animated mythological episodes to educate children and teenagers in compartments during their waiting time.

He later instructed the engineering and SVBC officials to complete the task of laying underground cables in the mada streets. He directs the forest wing officials to plant 10,000 saplings on the footpath routes from Alipiri and on the ghat roads. The EO was categorical that all out efforts should be made to contain the forest fires in Tirumala forests.

He also reviewed the progress of ongoing TTD engineering works at Tirumala and other places like Amaravati, Kurukshetra, Araku, Parvatipuram, Seethammapeta and Rampachodavaram. He asked officials to display photos of work progress by next review session.

The EO also said he would personally inspect the ongoing works at Appalayagunta temple and also urged officials to put up parking behind Govindaraja temple and informative flexi boards and set up public address systems.

Tirumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO Sri B Lakshmi Kantham, FACAO Sri O Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, ACVSOS Sri Sivakumar Reddy and other officers participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి సీనియర్‌ అధికారులతో ఈవో సమీక్ష

ఏప్రిల్‌ 16, తిరుపతి, 2019: టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సీనియర్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ఒంటిమిట్టలో నిర్వహించనున్న కల్యాణానికి వచ్చే భక్తుల ఏర్పాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో టీవీల్లో పిల్లలకు ఉపయోగపడేలా కార్టూన్‌, యానిమేషన్‌్‌ చిత్రాలు, శ్రీవారి పౌరాణిక ప్రాశస్త్యాన్ని, తిరుమల, తిరుపతిలోని ఆలయాలు, వాటి దూరం, ఎలా వెళ్లాలి అనే విషయాలను తెలిపేలా కథనాలను ప్రసారం చేయాలని ఆదేశించారు. శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భూగర్భ కేబుళ్లను మే చివరి నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌, ఎస్వీబీసీ అధికారులను ఆదేశించారు. అలిపిరి నడక మార్గంలో నాటిన 10 వేల మొక్కలను సంరక్షించాలని, మొదటి ఘాట్‌ రోడ్డులో ఇరువైపులా నాటిన మొక్కలు బాగా పెరిగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో అటవీప్రాంతంలో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

తిరుమల, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులపై ఈవో సమీక్షించారు. అమరావతి, కన్యాకుమారి, కురుక్షేత్ర, అరకు, పార్వతీపురం, సీతంపేట, రంపచోడవరంలో జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనుల ప్రగతికి సంబంధించిన ఫొటోలను వచ్చే సమావేశంలో చూపాలన్నారు. అప్పలాయగుంటలో జరుగుతున్న పనులను స్వయంగా వచ్చి పరిశీలిస్తామన్నారు. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వెనుకవైపు భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన పార్కింగ్‌ ప్రదేశం గురించి ఎక్కువ మంది భక్తులకు తెలిసేలా ఆలయంలో ఫ్లెక్సీ బోర్డుల ఏర్పాటుతోపాటు అనౌన్స్‌మెంట్‌ చేయాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీచంద్రశేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v