ANKURARPANAM FOR VASANTHOTSAVA_ మే 16న‌ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌
By TTD News On 15 May, 2019 At 06:31 PM | Categorized As Press Releases

Tirupati, 15 May 19: The Ankurarpanam for annual vasanthotsavam in Tiruchanoor will be observed on May 16.

The three day annual fete will be from May 17 to 19.TTD has cancelled arjita sevas in view of this festival.

FIRST TIME VASANTHA MANDAPAM SETTING COMING UP AT TIRUCHANOOR

The garden wing of TTD is setting up vasantha mandapam akin to Tirumala for this festival for the first time in Tiruchanoor.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATIపత్రికా ప్రకటన

మే 16న‌ శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2019 మే 15: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 17 నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలకు మే 16న‌ గురువారం అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. సాయంత్రం 6 నుండి 7.30 గంట‌ల వ‌ర‌కు పుణ్య‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అంకురార్ప‌ణ‌, సేనాధిప‌తి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఉత్సవాల్లో భాగంగా మే 18న ఉదయం 7.11 నుండి 11 గంట‌ల‌ స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. ఈ సందర్భంగా ఈ మూడు రోజులపాటు మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు వేడుక‌గా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగిస్తారు. గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

ఆర్జిత‌సేవ‌లు ర‌ద్దు :

వసంతోత్సవం కార‌ణంగా మే 16న క‌ల్యాణం, ఊంజ‌ల్‌సేవ‌, మే 17న క‌ల్యాణం, ల‌క్ష్మీపూజ‌, ఊంజ‌ల్‌సేవ‌, మే 18న క‌ల్యాణం, సామ‌వేద పుష్పాంజ‌లి, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌, మే 19న క‌ల్యాణం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ ర‌ద్ద‌య్యాయి.

ఆలయం వద్దనున్న ఆస్థాన మండపంలో ప్రతిరోజూ సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కళాకారులతో భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రాశస్త్యం :

సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారికి ఏడాది పొడవునా అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో అమ్మవారి వసంతోత్సవాలు అత్యంత మహిమాన్వితమైనవని పురాణాల ద్వారా తెలుస్తోంది.

వసంత ఋతువు ప్రాణుల పాలిట యముని కోరలుగా పెద్దలు తెలియజేశారు. సూర్యుడు వసంత ఋతువులో మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు, కావున ఆ తేజోవృద్ధివల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. శ్రీ పద్మావతి అమ్మవారిని ఈ ఋతువులో వసంతోత్సవాల ద్వారా ఆరాధనం చేయడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగి, ఆయురారోగ్యలు వృద్ధి చెందుతాయని అర్చకులు తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v