ANKURARPANAM HELD_ శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌
By TTD News On 16 May, 2019 At 07:15 PM | Categorized As Temple News

Tirupati, 16 May 19: The Ankuraropanam for annual vasanthotsavams was held in Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Thursday evening.

As the three day spring festival will be observed in the temple from May 17 to 19 this traditional ritual of prelude was observed.

Every day there will be snapanam to goddess in Friday gardens between 2.30pm and 4.30pm. In the night there will be Tiruchi vahana seva.

On May 18 will be procession of Swarnaratham in the morning.

For the first time the Garden wing of TTD has laid the Vasantha Mandapam set up in Friday Gardens for the fest.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2019 మే 16: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో మే 17 నుండి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఉద‌యం సుప్ర‌భాతంతో అమ్మ‌వారిని మేల్కొలిపి స‌హ‌స్ర‌నామార్చ‌న‌, నిత్యార్చ‌న చేప‌ట్టారు. సాయంత్రం పుణ్య‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నంతోపాటు అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. ఆ త‌రువాత శ్రీ విష్వ‌క్సేనుల‌వారిని ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేప‌ట్టారు.

వ‌సంతోత్స‌వాల‌ సందర్భంగా శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు వేడుక‌గా స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని ఘనంగా ఊరేగిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మే 18న ఉదయం 7.11 నుండి 11 గంట‌ల‌ స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. గృహస్త భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి ఒక రోజు వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్దనున్న ఆస్థాన మండపంలో ప్రతిరోజూ సాయంత్రం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కళాకారులతో భజనలు, కోలాటాలు ఏర్పాటు చేయనున్నారు.

వసంతోత్సవం కార‌ణంగా మే 17న క‌ల్యాణం, ల‌క్ష్మీపూజ‌, ఊంజ‌ల్‌సేవ‌, మే 18న క‌ల్యాణం, సామ‌వేద పుష్పాంజ‌లి, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌, మే 19న క‌ల్యాణం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవలను టిటిడి ర‌ద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v