ANNUAL BRAHMOTSAVAMS CONCLUDE WITH DHWAJAVAROHANAM _ ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు

Tirumala, 27 Sep. 20: The Navahnika annual brahmotsavams concluded on a religious note with Dhwajavarohanam on Sunday evening.

Garudalwar, who had invited all deities to take part in Brahmotsavams during Dhwajarohanam, now bid adieu in Dhwajavarohanam and seeking their participation again during next year Brahmotsavams.

This agama episode of Dhwajavarohanam took place in the Srivari temple between 8pm amd 9pm. The Archakas rendered seven mantras including Garuda Dhyanam, Bheri Pooja, Bheri Tandavam, Garuda Gadyam, Dikpalaka Gadyam, Garuda Lagnastakam, and Garuda Choornika on this ceremonious occasion.

Both the senior and junior pontiffs of Tirumala, TTD Chairman Sri YV Subba Reddy, and EO Sri Anil Kumar Singhal, board members Sri Chavireddy Bhaskar Reddy, Sri Sekhar Reddy, Sri Siva Kumar, Sri Ananta, Smt Nischita, and Additional EO Sri AV Dharma Reddy participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ వారి బ్రహ్మోత్సవాలు
తిరుమల, 2020 సెప్టెంబ‌రు 27: తిరుమల శ్రీ వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి.
రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఈ సందర్భంగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, డా.నిశ్చిత‌, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ డి.పి.అనంత పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.