ANNUAL FETE IN RISHIKESH FROM MAY 17_ మే 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు రిషికేష్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాలు
By TTD News On 20 Apr, 2019 At 10:08 AM | Categorized As Press Releases

Rishikesh, April 20, 2019: The Annual Brahmotsavams in Sri Venkateswara Swamy Temple in Rishikesh will be observed from May 17 to 25.

Dhwajarohanam will be observed between 11am and 12 noon in Karkataka Lagnam.

Other important days includes Radharohanam on May 24 and celestial Kalyanam will also be observed on the same day.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మే 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు రిషికేష్‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2019 ఏప్రిల్ 20: టిటిడికి అనుబంధంగా ఉన్న రిషికేష్ ఆంధ్ర ఆశ్ర‌మంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో మే 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. మే 16న అంకురార్ప‌ణ నిర్వ‌హిస్తారు.

మే 17వ తేదీన ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు క‌ర్కాట‌క ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం నిర్వ‌హిస్తారు. మే 24న ఉద‌యం 3.30 నుండి 5 గంట‌ల వ‌ర‌కు మేష ల‌గ్నంలో ర‌థారోహ‌ణం జ‌రుగ‌నుంది. అదేరోజు సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణోత్స‌వం నిర్వ‌హిస్తారు. మే 25న ఉద‌యం 10 నుండి 11 గంట‌ల వ‌ర‌కు చ‌క్ర‌స్నానం జ‌రుగ‌నుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v