ANNUAL VASANTHOTSAVAMS IN SKVST FROM MAY 22 TO 24_ శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాల గోడ ప‌త్రిక‌లు అవిష్క‌రించిన టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం
By TTD News On 16 May, 2019 At 05:48 PM | Categorized As General News

Tirupati, 16 May 19: The annual vasanthotsavams in the famous temple of Sri Kalyana Venkateswara Swamy at Srinivasa Mangapuram will be from May 22 to 24 and the wall posters for the same were released by Tirupati JEO Sri B Lakshmikantham in his camp office in Tirupati on Thursday.

Every day there will be snapana tirumanjanam between 2pm and 4pm and Tiruveedhi utsavam between 7pm and 8pm.

On May 23 there will be Swarnarathotsavam between 6pm and 7pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాల గోడ ప‌త్రిక‌లు అవిష్క‌రించిన టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం

తిరుపతి, 2019 మే 16: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల గోడ ప‌త్రిక‌లను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ బి.ల‌క్ష్మీకాంతం గ‌రువారం ఉద‌యం అవిష్క‌రించారు. తిరుప‌తిలోని జెఈవో క్యాంపు కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ మే 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వ‌సంతోత్స‌వాలు వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్ర‌తిరోజు మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు శ్రీ భూ సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, రాత్రి 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం జ‌రుగుతుంద‌న్నారు.

మే 23న స్వర్ణరథోత్సవం :

మే 23వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరుగనుంద‌ని తెలిపారు.

గృహస్తులు(ఇద్దరు) ఒక రోజుకు రూ.516/- చెల్లించి ఈ వసంతోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. వసంతోత్సవాల కారణంగా ఆలయంలో ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, అష్టోత్తర శతకలశాభిషేకం, తిరుప్పావ‌డ‌ సేవలను టిటిడి రద్దు చేశింది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ ధ‌నంజ‌యులు, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీఅనీల్‌ కుమార్‌, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v