AP CM OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE_ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు
By TTD News On 16 Mar, 2019 At 05:31 PM | Categorized As VIP News

Tirumala, 16 Mar. 19: The Honourable CM of AP Sri N Chandra Babu Naidu on Saturday offered prayers in the temple of Lord Venkateswara at Tirumala.

He had darshanam of Lord through Vaikuntham Queue Complex along with his family members.

Later the vedic pundits offered him Vedasirvachanam at Ranganayakula Mandapam. TTD EO Sri Anil Kumar Singhal, JEO Tirumala Sri KS Sreenivasa Raju offered him Theertha Prasadams and laminated photo of Lord Venkateswara.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు

తిరుమల, 2019 మార్చి 16: కలియుగ ప్ర‌త్య‌క్ష దైవమైన తిరుమ‌ల శ్రీ వేంకటేశ్వర‌స్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ‌నివారం స్వామివారిని దర్శించుకున్నారు.

ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలోనికి ప్రవేశించారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించిన అనంతరం ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజులు కలిసి గౌ|| ముఖ్యమంత్రివర్యులకు, వారి కుటుంబసభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v