ART FROM MAY ON WARDS IN PAT-JEO TPT_ శ్రీ పద్మావతి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతాం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం
By TTD News On 9 Apr, 2019 At 06:15 PM | Categorized As General News

Tirupati, 9 Apr. 19: In a unique initiative, the Augmented Reality Technology (ART) will come into force from May on wards in the famous shrine of Sri Padmavathi Ammavaru at Tiruchanoor wherein the sculptures speak out their significance attracting devotees, said TTD Tirupati JEO Sri B Lakshmikantham.

During a review meeting with various HoDs in the conference hall of TTD administrative building in Tirupati on Tuesday, the JEO said, the old Annaprasada Bhavanam in Tiruchanoor will be converted as a waiting hall with a capacity to hold over 600 pilgrims. The TTD roads in the temple city extending up to 26km. will be spruced up with a devotional touch apart from developing a Bougainvillea corridor all along the dividers, the JEO added.

The JEO said, the importance of festivals that are being observed in all major temples of TTD will be documented and telecasted in SVBC for better information of the pilgrims. Similarly they will also be updated in TTD website.

Later the JEO lauded the combined efforts of Tirupati Urban Police and TTD Vigilance in catching hold of one of the accused behind the crown theft case that took place in Sri Govinda Raja Swamy temple a couple of months ago. He said, RFID will be placed in all the temples to avoid such incidents in future.

The JEO also reviewed on the deployment of staffs to Vontimitta brahmotsavams.

CE Sri Chandrasekhar Reddy, SEs Sri Ramesh Reddy, Sri Ramulu, Sri Venkateswarulu, DFO Sri Phanikumar Naidu were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దుతాం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం

ఏప్రిల్‌ 09, తిరుపతి, 2019: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరులోని పాత అన్నదానం భవనంలో దాదాపు 600 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా అన్ని వసతులతో వేచి ఉండే హాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ తాగునీటి సౌకర్యం, లగేజి, పాదరక్షలు, సెల్‌ఫోన్‌ కౌంటర్లు, మరుగుదొడ్ల వసతి, టికెట్‌ కౌంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. వేచి ఉండే భక్తుల కోసం ఎల్‌ఇడి స్క్రీన్లు, టివిలు ఏర్పాటుచేసి ఎస్వీబీసీ కార్యక్రమాలు ప్రసారం చేస్తామని తెలిపారు. మే మొదటివారంలోపు శుక్రవారపు తోటలో శిల్పాలు మాట్లాడే విధంగా ఆగుమెంట్‌ రియాలిటి టెక్నాలజి సాయంతో ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు.

తిరుపతిలో 26 కి.మీ మేర ఉన్న టిటిడి రోడ్లలో రంగురంగుల పూలతో కనిపించే బోగన్‌ విల్లే మొక్కలు పెంచుతున్నామని, ఆకట్టుకునేలా విద్యుత్‌ అలంకరణతో శంఖుచక్రనామాలను ఏర్పాటు చేస్తున్నామని జెఈవో వివరించారు. అవిలాల చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేశామన్నారు. టిటిడి ఉద్యోగుల కోసం దశలవారీగా నాణ్యమైన నివాస భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. టిటిడి వసతి గృహాల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినట్టు చెప్పారు. టిటిడి కాల్‌ సెంటర్‌ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తామని, భక్తుల నుండి ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌, మెయిళ్ల ద్వారా సూచనలు, సలహాలు, ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.

టిటిడి పరిపాలనా భవనంలో పెయింటింగ్‌తోపాటు భక్తులు, సందర్శకుల కోసం ప్రయోగాత్మకంగా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తామని జెఈవో తెలిపారు. పరిపాలనా భవనంలోని కారిడార్లలో తిరుమల శ్రీవారి ఆలయం, స్థానికాలయాలు, ఇతర ప్రాంతాల్లోగల ఆలయాలు, దేవతామూర్తులకు సంబంధించిన చిత్రపటాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. సప్తగిరి మాసపత్రిక సర్కులేషన్‌ పెంచడంతోపాటు శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేసేలా, భక్తి భావాన్ని పెంచేలా మరింత నాణ్యమైన వ్యాసాలను ప్రచురించేలా ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. టిటిడి వెబ్‌సైట్‌, ఎస్వీబీసీ వెబ్‌సైట్‌లో పండుగలు, ఉత్సవాలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను పొందుపరుస్తామన్నారు. పండుగల విశిష్టతను తెలిపేలా డాక్యుమెంటరీలు రూపొందించి ఎస్వీబీసీలో ప్రసారం చేస్తామన్నారు.

శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఆభరణాల కేసును ఛేదించిన పోలీసు, విజిలెన్స్‌ అధికారులకు జెఈవో అభినందనలు ..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో చోరీకి గురైన కిరీటాల కేసును ఛేదించిన తిరుపతి అర్బన్‌ పోలీసులను, టిటిడి విజిలెన్స్‌ అధికారులను జెఈవో శ్రీ బి.లక్ష్మీకాంతం అభినందించారు. ఆభరణాలు చోరీకి గురికాకుండా ఆర్‌ఎఫ్‌ఐడి(రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటి డివైజ్‌) సాయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామన్నారు.

ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రమేష్‌రెడ్డి, శ్రీవేంకటేశ్వర్లు, శ్రీ ఎ.రాములు, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

 
 Copyright © 2013 Tirumala Tirupati Devasthanams All Rights Reserved.  Designed by O/o.EDP Manager, TTD, Tirupati.
0am ` az v