CHAIRMAN UNVEILS TTD CALENDARS _ శ్రీ‌వారి ద‌య‌తో క‌రోనాపై విజ‌యం సాధించాలి టిటిడి క్యాలెండర్ ఆవిష్కర‌ణ‌లో చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

Tirupati, 6 Oct. 20: TTD Chairman Sri YV Subba Reddy on Tuesday sought Srivari blessings for victory in the battle over pandemic COVID 19.

Speaking on the occasion while releasing the 2021 TTD calendars at Hyderabad TTD Information Centre, the TTD Chairman said the calendars and diaries were unveiled by the Honourable Chief Minister Sri YS Jaganmohan Reddy during the annual Srivari Brahmotsavam held in Ekantham in view of pandemic corona restrictions.

He said for the benefit of people of Telangana the calendars and diaries are made available at TTD Kalyana Mandapam at Himayat nagar.

TTD trust board member and local advisory committee member Sri Govind Hari and other members were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ద‌య‌తో క‌రోనాపై విజ‌యం సాధించాలి

టిటిడి క్యాలెండర్ ఆవిష్కర‌ణ‌లో చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

తిరుప‌తి‌, 2020 అక్టోబ‌రు 06: క‌రోనాపై చేస్తున్న పోరాటంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ద‌యతో ప్ర‌పంచ ప్ర‌జ‌లంద‌రూ విజ‌యం సాధించాల‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు ముద్రించిన 2021 సంవత్సర క్యాలెండర్ల‌ను మంగళవారం ఆయ‌న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో టిటిడి నూత‌న క్యాలెండ‌ర్లు, డైరీలు విడుద‌ల చేయ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంద‌న్నారు. ఇందులో భాగంగానే ఈ సారి కూడా ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా డైరీలు, క్యాలెండ‌ర్లు విడుద‌ల చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌లో భాగంగా శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు ఏకాంతంగా ఘ‌నంగా నిర్వ‌హించామ‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం హిమాయత్ నగర్ టిటిడి కల్యాణ మండపంలో ఈ క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతార‌ని తెలిపారు. టిటిడి బోర్డు సభ్యుడు, స్థానిక స‌ల‌హా మండ‌లి అధ్యక్షులు శ్రీ గోవింద హరి, ఇతర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.