BALAJI RESERVOIR TO RESOLVE WATER WOES FOR THE NEXT 60 YEARS-TIRUPATI MLA AND TTD BOARD SPECIAL INVITEE _ భక్తుల తాగునీటి అవసరాలు తీర్చే వరప్రసాదిని బాలాజి రిజ‌ర్వాయ‌ర్ : తిరుప‌తి శాస‌న స‌భ్యులు శ్రీ భూమ‌న్ క‌రుణాక‌ర్‌రెడ్డి

Tirupati, 12 Oct. 19: The prestigious Balaji Reservoir will resolve the water woes of a multitude of pilgrims thronging Tirumala as well the locals once it is completed, said Tirupati Legislator and TTD Board Special Invitee Sri B Karunakar Reddy.

The local MLA along with TTD Engineering Chief Sri Ramachandra Reddy and other officials inspected Balaji Reservoir on Saturday evening.

Later speaking to media persons he said, both Balaji Reservoir and Galeru Nagari Projects were neglected all these years which were the main water sources of Tirumala and Tirupati and surrounding places.

Adding further he said, keeping in view the ever-increasing pilgrim rush to Tirumala, the present TTD Trust board has felt the importance of Balaji Reservoir Project which has 3TMC capacity that resolves the water woes of Tirumala.

“The total project cost has been estimated as Rs.350crores. When once the project completes, it will be very helpful for the pilgrims as well as locals.  TTD should complete this massive project programme on a war-footing basis”, he maintained.

The local legislator also said, “Only the Balaji Reservoir has the holding capacity up to 1TMC even when there is scanty rainfall without depending on Krishna waters. This feature is unique to this project alone as per the version of Engineers. So our priority will be this project.  When once it becomes a reality, there will be no water woes for the next six to eight decades”, he asserted.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

భక్తుల తాగునీటి అవసరాలు తీర్చే వరప్రసాదిని బాలాజి రిజ‌ర్వాయ‌ర్ : తిరుప‌తి శాస‌న స‌భ్యులు శ్రీ భూమ‌న్ క‌రుణాక‌ర్‌రెడ్డి

తిరుపతి, 2019 అక్టోబ‌రు 12: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు, తిరుపతి వాసుల తాగునీటి అవసరాలు తీర్చే వరప్రసాదిని బాలాజీ రిజర్వాయర్ అని తిరుప‌తి శాస‌న స‌భ్యులు మ‌రియు టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ భూమ‌న్ క‌రుణాక‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ నీటిపారుద‌ల శాఖ అధికారులు, టిటిడి ఇంజినీరింగ్ అధికారుల‌తో క‌లిసి శ‌నివారం సాయంత్రం బాలాజి రిజ‌ర్వాయ‌ర్‌ను ఆయ‌న ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలకు వచ్చే భక్తులకు, తిరుపతివాసుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు బాలాజీ రిజర్వాయర్ ను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తిరుమల కొండల నుండి 1 టిఎంసీ వర్షపు నీరు వృధాకు పోతోందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారని, ఈ నేపథ్యంలో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా నేరుగా బాలాజీ రిజర్వాయర్ కు తీసుకువచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దాదాపు 3.3 కి.మీ వైశాల్యంలో రూ.350 కోట్లతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని, ఇప్పటికే 574 ఎకరాల భూమిని సేకరించారని, 500 హెక్టార్ల అటవీ భూమి అనుమతులు పొందినట్లు తెలిపారు. ఈ రిజర్వాయర్ నిర్మాణంతో తిరుమలకు విచ్చేసే భక్తులతో పాటు, భగవంతునితో అనుసంధానం ఉన్న తిరుపతివాసుల తాగునీటి అవసరాలు తీరనున్నాయన్నారు. రోజుకు సరాసరి లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తున్నారని, భవిష్యత్ లో భక్తులకు తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు ఈ రిజర్వాయర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. అనంతరం అధికారులతో కలిసి మల్లిమడుగు రిజర్వాయర్ ను పరిశీలించారు.

తిరుపతి ఎమ్మెల్యే , టిటిడి బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ శ్రీ రామ‌చంద్రారెడ్డి, ఎస్ఇ శ్రీ వేంకటేశ్వర్లు, ఈఈలు శ్రీ మనోహరం, శ్రీ రవిశంకర్ రెడ్డి, ప్రభుత్వ ఎస్ఈ శ్రీ ఎస్వీ రావు, ఈఈ శ్రీ రాధకృష్ణ ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.