BHASHYAKARULA UTSAVAM HELD IN TIRUMALA _ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల‌ సాత్తుమొర

Tirumala, 28 Apr. 20: The 10-day religious fete, Bhashyakarula Utsavam came to a conclusion with Bhasyakarula Sattumora in Tirumala on Tuesday.

The great Sri Vaishnava Saint Ramanujacharya was the architect of many rituals, kainkaryams and procedures that are being followed in Srivari temple even today as per Vaikhanasa Agama.

He pioneered the establishment of Jiyar mutt, consecrated various idols in sub-temples inside Tirumala temple, introduced Naivedyam offerings, recitation of Alwar Divya Prabandha Pasura Parayanam, construction of four-mada streets surrounding the temple, Purna Kumbha Swagatham, the appointment of Acharyapurushas to take of care of Kainkaryams etc.

This great Sri Vaishnava Acharyapurusha has given his commentary to Sri Bhashyam, a Sanskrit Mimamsa (Philosophy) text and became famous by name Sri Bhashyakarula Varu.

Every year on the advent of Arudra Nakshatra, which happens to be the birth star of Sri Ramanujacharya, Bhashyakarula Sattumora is observed in Tirumala temple.

As a part of this fete on Tuesday, the utsava idol of Sri Ramanujacharya was taken on a procession around Vimana Prakaram in the morning amidst the recitation of Gosthi Todakkam by Parayanamdars.

Later in the evening, Sri Malayappa Swamy accompanied by Sridevi and Bhudevi along with Sri Bhashyakarula varu was taken on a celestial procession around Vimana Prakaram.

HH Tirumala Sri Pedda Jiyangar Swamy, HH Sri Chinna Jiyangar Swamy of Tirumala, a few temple staff were present in the religious fete in view of the ongoing COVID 19 lock down restrictions in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల‌ సాత్తుమొర

తిరుమ‌ల‌, 2020 ఏప్రిల్ 28: తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు జరిగిన భాష్యకార్ల ఉత్సవాలు మంగళవారం సాత్తుమొరతో ముగిశాయి.

శ్రీ రామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్ర‌తి ఏటా శ్రీ‌వారి ఆల‌యంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు. భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా ప్రసిద్ధిచెందారు.

భగవద్‌ రామానుజులు దేశమంతటా సంచరించి శ్రీవైష్ణవతత్వాన్ని పరిపుష్టం చేస్తూ ప్రచారం చేశారు. దేశంలోని అనేక శ్రీవైష్ణవక్షేత్రాల జీర్ణోద్ధరణ, అభివృద్ధి చేయడంతోపాటు ఆలయ పూజాది కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జీయర్ మఠం ఏర్పాటుతో పాటు శ్రీవారి ఆలయంలో ఉప ఆలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ, పలు నైవేద్యాల సమర్పణ, ఆళ్వార్ దివ్యప్రబంధ పాశురాల పారాయణం, నాలుగు మాడ వీధుల ఏర్పాటు, పూర్ణకుంభ స్వాగతం, ఆచార్య పురుషుల నియామకం వంటి వాటిని శ్రీ రామానుజాచార్యులు చేపట్టారు.

భాష్యకార్ల సాత్తుమొర సందర్భంగా రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, శ్రీ భాష్య‌కార్ల వారికి విశేష స‌మ‌ర్ప‌ణ చేపట్టారు.  శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని ఒక తిరుచ్చిపై, శ్రీభాష్యకార్లవారిని మరో తిరుచ్చిపై విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ తరువాత భాష్యకార్లవారి సన్నిధిలో సాత్తుమొర నిర్వహించి ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు చేపట్టారు.

తిరుమలలో కోవిడ్-19 లాక్ డౌన్ నిబంధనల కారణంగా శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి పరిమిత సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.