BRAHMOTSAVAM OF SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE BEGINS WITH DWAJAROHANAM _ ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

Appalayagunta, 2 June 2020: The annual Brahmotsavams of Sri Prasanna Venkateswara Swamy temple commenced with Dhwajarohanam on Tuesday.

The sacred Garuda flag was hoisted on the Dwajasthambham amidst chanting of Veda mantras and Mangala Vaidyams and later Asthanam was performed.

Speaking on the occasion the TTD EO Sri Anil Kumar Singhal said the annual Brahmotsavams from June 2-10 commenced as per Vaikhanasa Agama traditions but all vahana sevas remain cancelled this year in view of Coronavirus restrictions. However, there would be Tiruchi vahana seva daily in the morning and in the evening within the temple corridors.

Detailing the Brahmotsavam programs the TTD EO said Srivari Arjita Kalyanotsavam will be held on June 5 evening and on June 10 Chakra Snanam will be performed within temple premises in Gangalam.

TTD Dyeo of local temples Smt Jhansi Rani, Temple Chief Archaka Sri Surya Kumar Acharyulu, Kankana Bhattar Sri Tippayya Acharyulu and Superintendent Sri Gopalakrishna Reddy participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2020 జూన్ 02: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగ‌ళ‌వారం ఉదయం 10.30 నుంచి 11 గంటల మద్య ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. ఆనంతరం స్వామివారి ఆస్థానం జరిగింది.

ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ  జూన్‌ 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు మంగ‌ళ‌వారం ఉద‌యం వైఖాన‌స ఆగ‌మోక్తంగా ధ్వ‌జారోహ‌ణం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. కరోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఈ ఏడాది వాహనసేవల‌ ఊరేగింపును రద్దు చేసిన‌ట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం ఏకాంతంగా నిర్వహిస్తామ‌న్నారు.  

జూన్ 5న సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల‌ వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తార‌న్నారు. అదేవిధంగా జూన్‌ 10న ఉదయం 9.30 నుండి 10 గంటల‌ వరకు ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆల‌యాల డెప్యూటీ ఈవో శ్రీమ‌తి ఝాన్సీరాణి, ఆలయ  ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, కంకణ భట్టార్ శ్రీ తిప్ప‌య్య ఆచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.