CASE BOOKED FOR BASELESS CAMPAIGN ON TTD _ టిటిడిపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసు

Tirumala, 20 July 2020: Upon the complaint by Tirumala Temple Deputy EO Sri Harindranath, the Tirumala One Town Police have booked a case against a person on Monday who made baseless comment that Srivari temple OSD Sri Pala Seshadri was affected with COVID-19 positive and getting treatment at Apollo hospital in Chennai.

A case has been registered against one Sri SV Badri who made a Twitter post.

TTD clarified that Sri Seshadri went to Apollo Hospital at Chennai once in two months for regular medical check up as he had kidney transplantation.

Sri Seshadri initially had COVID test done to him at Tirumala on July 2 where the result came as negative and again on July 18-19 also he underwent COVID-19 testing twice and found COVID negative.

TTD said it reserved its rights to file a case under Epidemic diseases Act as such devious campaign hurt and confuse the devotees coming for Srivari darshan.

The TTD officials also said that persons involving in such baseless and malafide campaign against TTD will have to face legal consequences.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడిపై దుష్ప్రచారం చేసిన వారిపై కేసు
తిరుమ‌ల‌, 2020 జూలై 20: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రికి కోవిడ్- 19 పాజిటివ్ అని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసిన వ్యక్తిపై టిటిడి శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
ఎస్.వి.బద్రి అనే వ్యక్తి తన తన ట్విట్టర్ ఖాతాలో డాలర్ శేషాద్రికి కోవిడ్- 19 పాజిటివ్ వచ్చిందని, చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోస్టు పెట్టారు.
ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి ప్రతి రెండు నెలలకు ఒకసారి చెన్నై అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు వెళుతుంటారు. ఈ క్రమంలో జూలై 18,  19వ తేదీల్లో అపోలో ఆస్పత్రిలో సాధారణ వైద్య పరీక్షలతోపాటు కోవిడ్- 19 పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల్లో రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. అంతకుముందు జూలై 2న తిరుమలలో  కోవిడ్ పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చింది.
కోవిడ్‌-19 స‌మ‌యంలో భ‌క్తులను గంద‌ర‌గోళానికి గురిచేసేలా అసత్య ప్రచారం చేసినవారిపై ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ప్ర‌కారం చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంది.  భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎస్.వి.బద్రి అనే వ్యక్తి అసత్యాలను సదరు పోస్టింగులో ప్రచారం చేశారు. దీనిపై శ్రీవారి ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టిటిడికి సంబంధించి ఇలాంటి అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టిటిడి  హెచ్చరిస్తోంది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.