CHATURMASA DIKSHA OF TIRUMALA PONTIFFs BEGINS AT TIRUMALA _ తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం

Tirumala, 5 Jul. 20: The   Sankalpam of Chaturmasa Diksha of HH Sri Pedda Jeeyangar and HH Sri Chinna Jeeyangar Swamy began at Tirumala on Sunday.

Earlier during the day Diksha Sankalpam was conceived by both the Senior and Junior Pontiffs of Tirumala in Pedda Jeeyangar Mutt. They performed Kalasa Sthapana, Kalasa Puja and Vishwaksenaradhana etc. Later they visited Swamy Pushkarini, Sri Varahaswami temples before paving visit to Srivari temple.

They were traditionally received by TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy at temple Mahadwaram. The senior pontiff was presented with Melchat Vastram while Junior Pontiff with Nulchat vastram.

Speaking later after darshan, Sri Sri Sri Pedda Jeeyar Swami said the Chaturmasam Diksha conceived by Sri Ramanujacharya had a significant place in the Sri Vaishnava traditions. As per legends, it signalled the four months of yoga Nidra of Sri Mahavishnu from Ashada Suddha Ekadasi to Karthika Shuddha Ekadasi.

Sri Chinna Jeeyarswami said the Sankalpam of Chaturmasam Diksha was ordained on the auspicious day of Guru Poornima

Later, the Jeeyarswamis felicitated the TTD EO and Additional EO at the Pedda Jeeyarswami Matham.

TTD Board Member Sri Sekhar Reddy,  CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Harindranath,  VGO Sri Manohar, OSD Sri Pala Seshadri, and other senior officials participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస దీక్ష సంకల్పం
తిరుమల, 2020 జూలై 05: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైన‌ద‌న్నారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారని తెలిపారు. కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని, చాతుర్మాస వ్రతం ప్రాచీనకాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు.
అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులవారి వంశపారంపర్య ఆచారంలో భాగంగా గురు పూర్ణిమ ప‌ర్వ‌దినాన ఈ చాతుర్మాస దీక్ష సంకల్పాన్ని చేయడం విశేషమైనదిగా భావిస్తారన్నారు.
అంతకుముందు శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ స్థాప‌న, క‌ల‌శ పూజ‌, విష్వక్సేనారాధన, మేదినిపూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వ‌హించచారు. త‌రువాత సేక‌రించిన పుట్ట మ‌న్నుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి చాతుర్మాస సంక‌ల్పం స్వీక‌రించారు. అనంత‌రం  ‌‌శ్రీ పెద్దజీయంగారు తిరుమల బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కనగల జీయంగారి మఠం వద్ద నుండి శ్రీ చిన్నజీయంగారు మరియు ఇతర శిష్యబృందంతో బయల్దేరారు. తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ  స్వామి పుష్కరిణి, శ్రీ వరాహస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. అక్కడినుంచి మంగళవాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం చెంత టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఇతర ఆలయ అధికారులతో కలిసి సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికారు. శ్రీ జీయంగార్లు శ్రీవారిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్‌చాట్‌ వస్త్రాన్ని, శ్రీ చిన్నజీయంగారికి నూలుచాట్‌ వస్త్రాన్ని బహూకరించారు.
అనంతరం శ్రీపెద్దజీయర్‌ మఠంలో శ్రీ పెద్దజీయర్‌స్వామి,శ్రీ చిన్నజీయర్‌స్వామి కలిసి ఈవో, అద‌న‌పు ఈవో, సివిఎస్వోను శాలువతో సన్మానించారు. అనంత‌రం శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయర్ స్వామి భ‌క్తుల‌కు కొబ్బ‌రికాయల‌ను బ‌హూక‌రించారు. ఈ కొబ్బ‌రికాయ‌ల‌ను ఇంటిలో ఉంచుకుంటే ఆయురారోగ్య‌లు, అష్ట‌ఐశ్వ‌ర్యాలు సిద్ధిస్తాయ‌ని అర్చ‌కులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యుడు శ్రీ శేఖర్ రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఒఎస్‌డి శ్రీ పాల శేషాద్రి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.