CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

Tirumala, 25 Dec. 20: The Honourable Chief Justice of India, Sri Sharad Arvind Bobde had Vaikuntha Dwara Darshanam on the auspicious day of Vaikuntha Ekadasi on Friday.

Earlier, on his arrival at Mahadwaram, he was welcomed by TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy. Later, inside the temple he was accompanied by TTD Trust Board Chairman Sri YV Subba Reddy for darshan.

After offering prayers to the presiding deity of Sri Venkateswara Swamy, the CJI had Vaikuntha Dwara Darshanam which is considered to be auspicious.

Later he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam and was presented with Thirtha Prasadams and Diary, Calendar and lamination photo of Lord Venkateswara.

District Judge Sri Ravindra Babu, CVSO Sri Gopinath Jatti, Temple DyEO Sri Haridranath, Urban SP Sri Ramesh Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి

 తిరుమల, 2020 డిసెంబ‌రు 25: భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ శ‌ర‌ద్ అర్వింద్ బాబ్డే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్ర‌వారం తిరుమ‌ల శ్రీ‌వారిని ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నారు.

ఆల‌య మ‌హ‌ద్వారం వ‌ద్దకు చేరుకున్న శ్రీ బాబ్డే గారికి టిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు.

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం శ్రీ బాబ్డే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నారు. అనంత‌రం రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, చిత్రప‌టం అందించారు.

జిల్లా జ‌డ్జి శ్రీ ర‌వీంద్ర‌బాబు, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, అర్బ‌న్ ఎస్పీ శ్రీ ర‌మేష్‌రెడ్డి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.